MoviesTollywood news in telugu

ఈ నటి రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Telugu character artist kalyani natarajan :టాలీవుడ్ లో 2018 లో ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో వహించిన గీత గోవిందం చిత్రంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్ తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కళ్యాణి నటరాజన్ ఆతర్వాత కవచం, అల వైకుంఠపురంలో, సోలో బ్రతుకే సో బెటర్, తదితర చిత్రాలలో నటించింది. నిజానికి తమిళ పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ తెలుగు మాట్లాడడం సరిగా రాకపోయినప్పటికీ డబ్బింగ్ తో నెట్టుకొచ్చేస్తోంది.

అంతేకాదు, ప్రముఖ దర్శకుడు విద్యా సాగర్ రాజు దర్శకత్వం వహించిన ఫక్ (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించి మానవ ప్రపంచంలో జెండర్ సమానత్వం గురించి డైలాగులతో అదరగొట్టేసింది. ప్రస్తుతం వరుస టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ఈమె సినిమాల్లోకి రాకముందు దాదాపుగా 15 కు పైగా పలు సంస్థల వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది. ఇక మోడలింగ్ రంగంలో కూడా కొన్నాళ్ళు రాణించింది.

తెలుగు, తమిళ మూవీస్ లో నటించడానికి కళ్యాణి నటరాజన్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటోందో అనే అంశంపై పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతు న్నాయి. ఒక్క సినిమాకి దాదాపుగా 2 లక్షల నుంచి మూడు లక్షల వరకూ అందు కుంటోందని టాక్. పైగా షూటింగ్ ప్రదేశాలకు చేరుకోవడానికి అయ్యే రవాణా ఖర్చులతో పాటు బస చేయడానికి హోటల్ వసతులు, ఇతర ఖర్చులు కూడా నిర్మాతలే పెట్టు కోవాలట. అలాగే సినిమా బడ్జెట్ ని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.