రానా ఇల్లు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే…!?

Rana Luxurious Home :మూవీ మొఘల్ స్వర్గీయ దగ్గుబాటి రామానాయుడు మనవడిగా, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు తనయునిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో రానా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ, కథ నచ్చితే నెగెటివ్ రోల్ కి సైతం వెనుకాడకుండా నటిస్తూ తన సత్తా చాటున్నాడు. ఫలితంగా పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే తక్కువ సినిమాలలో నటించినప్పటికీ ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నాడు.

కాగా రానా లగ్జరీ హౌస్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి చాలా సంవత్సరాల క్రితం నుంచే ఈ ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఇల్లు రానా సొంత ఇల్లు. పైగా రామానాయుడు స్టూడియోస్ కు పరిసరాల్లోనేఈ ఇల్లు ఉంది. అయితే అతని ఇంటికి సంబంధించిన ఫోటోలు గతంలో ఎప్పుడూ వైరల్ కాలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి తనకు నచ్చినవిధంగా ఈ ఇంటిని రానా నిర్మించు కున్నాడు. అయితే ఎంత ఖర్చు చేశాడన్నది క్లారిటీ లేదు. రానా తన ఇంట్లోనే విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన స్టూడియో కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం రానా ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకూ అందుకుంటున్నట్లు టాక్.

కమర్షియల్ గా హిట్టయ్యే సినిమాల కంటే నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రస్తుతం రానా అరణ్య, విరాటపర్వం అనే సినిమాల్లో నటిస్తుండగా కొద్ది నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన విరాటపర్వం టీజర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫిదా మూవీతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కాగా మార్చి 26న అరణ్య మూవీ రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది.