స్టార్ హీరోయిన్స్ వాడుతున్న హ్యాంగ్ బాగ్స్ ధర తెలిస్తే గుండె గుభేల్

Tollywood actresses Hand Bags :గతంతో పోలిస్తే అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకూ ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఇండస్ట్రీకి వచ్చాక హిట్ మీద హిట్ కొడుతుంటే రెమ్యునరేషన్ కూడా పెంచేస్తూ, ఆ సొమ్ముని వేరే రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి,రెండు చేతులా సంపాదిస్తున్నారు. హీరో, హీరోయిన్స్ స్టార్ డమ్ తెచ్చుకున్నాక వాళ్ళు వాడే వస్తువులు కూడా వాళ్ళ రేంజ్ కి తగ్గట్టే ఉంటున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ వాడుతున్న ప్రతి వస్తువు కాస్ట్లీ గానే ఉంటోంది. పెదాలకు వేసుకునే లిప్ స్టిక్ మొదలు ధరించే డ్రెస్సులు,వేసుకునే చెప్పులు వరకు ఒకటేమిటీ అన్నీ అంత్యంత ఖరీదైనవే వాడుతున్నారు. అయితే ఈమధ్య హ్యాండ్ బాగ్స్ కూడా ఖరీదుని చాటిచెబుతున్నాయి. మన స్టార్ హీరోయిన్స్ కొందరు వారు ఉపయోగిస్తున్న హ్యాండ్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే, గుండె గుభేల్ మంటుంది.

అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే వాడుతున్న హ్యాండ్ బాగ్ ఖరీదు అక్షరాలా 2,17,218 రూపాయలు. బొట్టేగా వెనేట.. అనే కంపెనీ హ్యాండ్ బ్యాగ్ ఈమె వాడుతోంది. ఈ అమ్మడు వరుస సినిమాలతో దుమ్మురేపుతోంది. ఒక దశలో గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ ఎడ్రెస్ గా మారిన ఛార్మి కేవలం కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసి సత్తా చాటింది. ఈమె వాడుతున్న హెర్మేస్ అనే హ్యాండ్ బ్యాగ్ ధర 4,85,846 రూపాయలు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాతగా మారిన ఛార్మి పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఛాన్స్ లతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఉపయోగించే ఛానెల్ అనే కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఏకంగా 3,33,918 రూపాయలు అంటే ఆశ్చర్యపోతాం. తన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ భామ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతోంది. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన దేశముదురు మూవీలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించి తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, తొలిమూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హన్సిక ఉపయోగించే “గుచ్సి“అనే కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ ధర1,34,048 రూపాయలు. ఇండస్ట్రీలో వరుస ఛాన్స్ లతో ఆకట్టుకున్న ఈమె తెలుగులో కన్నా తమిళంలో బాగా పాపులర్టీ సాధించింది.

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా మూవీతో టాలీవుడ్ ని ఫిదా చేసిన సాయి పల్లవి లూయిస్ వీటన్“అనే కంపెనీ హ్యాండ్ బ్యాగ్ ను ఉపయోగిస్తున్నారు.ఈ బ్యాగ్ ధర ఏకంగా1,75,762 రూపాయలు. పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయిన ఈ అమ్మడు తక్కువ కాలంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. భరత్ అనే నేనుసినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీకట్టి బ్లాక్ బస్టర్ అందుకున్న కియారా అద్వానీ వాడుతున్న ఫెండి కంపెనీ బ్యాగ్ ధర ఏకంగా 3,67,307 రూపాయలు. తెలుగులో రామ్ చరణ్ సరసన కూడా నటించిన కియారా బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది.