MoviesTollywood news in telugu

కరీనా కపూర్ మాస్క్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

Kareena Kapoor Mask cost : కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు,యంత్రాంగం విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ ధరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల జరిమానాలు కూడా వేస్తున్నారు. దీంతో చాలామంది మాస్క్ లు పెట్టుకుంటున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు వాడే వస్తువుల మాదిరిగా మాస్క్ లు కూడా రేటు అదరగొట్టేస్తున్నాయి.

సాధారణంగా మనం ధరించే మాస్కుల ఖరీదు మహా అయితే 200 రూపాయలు ఉండొచ్చు. మహా అయితే 500 రూపాయల ధర కలిగిన మాస్కును ధరిస్తాం. కానీ బాలీవుడ్ బెబో కరీనాకపూర్ మాస్కు ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె ధరించిన మాస్కు ధర అక్షరాలా 26 వేల రూపాయలట.

సెలెబ్రెటీల లైఫ్ స్టైల్ రేంజ్ ఇలా కాకపొతే ఎలా ఉంటుంది. కరీనా వాడే మాస్క్ లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందింది.ఈ బ్రాండ్ అనేది చాలా కాస్ట్లీ వ్యవహారమే. ఇప్పుడు దాన్ని మించిపోయేలా కరీనా మాస్క్ ధర ఉంది.