రవితేజ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా?

ee abbai chala manchodu movie heroine vani :ఇండస్ట్రీలో నిలబడాలంటే అందం,అభినయం,టాలెంట్ తో పాటు అదృష్టం కల్సి రావాలి. లేకుంటే మరుగున పడిపోవడం ఖాయం. ఒక్క సినిమాతోనే మళ్ళీ కనిపించకుండా పోయినవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా ఇలా చూస్తుంటాం. ఒకసారి గతంలోకి వెళ్తే, టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు మూవీ అప్పట్లో ఇటు కమర్షియల్ గా అటు మ్యూజికల్ గా కూడా మంచి మార్కులు తెచ్చుకుంది.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్లుగా వాణి, సంగీత తదితరులు నటించగా సనా, ప్రీతీ నిగం, బెనర్జీ, అజయ్ రత్నం, తదితరులు ప్రధాన తారాగణం. ఈ సినిమాలో హీరోగా చేసిన రవితేజ స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు. నిజానికి ఇండస్ట్రీకి వచ్చిన చాలా కాలానికి స్టార్ హీరో హోదా అందుకుని వరుస సినిమాలతో దూసుకెళుతూ,ఈమధ్య కాస్త వెనుకబడ్డాడు. క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే ఈ అబ్బాయి చాలా మంచోడులో మెయిన్ హీరోయిన్ గా చేసిన వాణి వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకున్నప్పటికీ ఎందుకో సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక ఇండస్ట్రీకి దూరమైంది.

అప్పట్లో ఈ అమ్మడికి ఓ స్టార్ హీరో చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినా,అందిపుచ్చుకోలేకపోయిందని టాక్. పైగా వాణి హీరోయిన్ గా కెరీర్ మొదలు సమయంలో అనుకోకుండా ఈమె హీరోయిన్ గా నటించిన రెండు చిత్రాలు మధ్యలోనే షూటింగ్ ఆగిపోవడంతో ఈ ప్రభావం అమ్మడి సినిమా కెరియర్ పై పడినట్లు టాక్ నడిచింది. ఈమె ఎక్కడ ఉందొ, ఎలా ఉందొ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదట. ఇక అదే సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన సంగీత ప్రస్తుతం టాలీవుడ్ లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, మంచి ఆఫర్స్ అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య మూవీలో సంగీత మెరవనుంది.