కోవై సరళ పెళ్ళికి దూరం ఎందుకో తెలుసా…అసలు నమ్మలేరు

Kovai Sarala :టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న కోవై సరళ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా పాపులర్. ఇప్పటిదాకా సుమారు 750 సినిమాల్లో నటించినట్లు టాక్. మిగతావారితో పోలిస్తే, కామెడీ పండించడంలో ఆమెది ప్రత్యేక శైలి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ, టీవీ షోలకు జడ్జిగా వ్యవరిస్తున్నారు. ఆమె అసతపోవతు యారు లో రెగ్యులర్ గెస్ట్ జడ్జిగా పనిచేసింది. కోవై సరళ పాసా పరవైగల్ అనే రియాలిటీ షోను కూడా నిర్వహించింది. తమిళ టీవీ చానల్ విజయ్ టీవీలో ప్రసారమయ్యే తమిళ కామెడీ షో కామెడిల్ కలకువత్తు ఎప్పాడి కు ఆమె జడ్జిగా ఉంది.

1962 ఏప్రిల్ 7న తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన కోవై సరళ చిన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకుంది. చదువు పూర్తయ్యాక సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. కోవై సరళ తొమ్మిదో తరగతిలో ఉండగా విజయ కుమార్, కె.ఆర్. విజయ సరసన వెల్లి రథం అనే తమిళ సినిమాలో మొట్టమొదటి సారిగా కనిపించింది. ఇక టెన్త్ లో ఉండగా ఆమె ముంధనై ముడిచ్చు మూవీలో 32 ఏళ్ళ గర్భిణిగా నటించి మెప్పించింది. రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించి అదరగొట్టింది.

తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను కోవై సరళ మూడు సార్లు అందుకున్నారు. ఎపి ప్రభుత్వం తరపున ఓరి నీప్రేమ బంగారం కానూ (2003) అనే సినిమాకు ఉత్తమ హాస్యనటిగా నంది పురస్కారం అందుకున్నారు. ఈమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.58 ఏళ్ల నటి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదని ఫాన్స్ ఆశ్చర్యపోతారు. కుటుంబానికి పెద్ద కుమార్తె, ఆమెకు నలుగురు చెల్లెల్లు ఉన్నారు. దీంతో వారికి వివాహం చేస్తూ, వారి పిల్లలకు సరైనా విద్యను అందిస్తూ తాను ఒంటరిగా ఉండిపోయింది. ఒంటరికిగా ఉండడం ఆమెకు ఇష్టమట. అందుకే ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అన్నట్టు కమల్ హాసన్ సరసన సతీ లీలావతి మూవీలో కోవై సరళ నటించి మెప్పించింది.