నాగభైరవి సీరియల్ హీరోయిన్ భైరవి లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి…?

Naga bhairavi Serial :నాగభైరవి సీరియల్ హీరోయిన్ భైరవి అసలుపేరు యాష్మి గౌడ. 1995 జనవరి 18న కర్ణాటక లోని బెంగుళూరులో జన్మించిన యాష్మి కి చిన్నతనం నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి ఉండడంతో నటి కావాలని కలలు కనేది. హోలీ చైల్డ్ ఇంగ్లీష్ స్కూల్లో చదువుకుంది. దయానంద సాగర్ ఇనిస్టిట్యూట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది.

ఇక 2016లో మిస్ జెనెటిక్ ఫోటో టైటిల్ గెలుచుకుంది. విద్య వినాయక కన్నడ సీరియల్ లో నటించిన యాష్మి తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. వెన్నెల పాత్రలో చేసి,అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. త్రినయని సీరియల్ లో కూడా నటించింది.

వెబ్ సిరీస్ లో నటించడమే కాకుండా హిందూ ద ట్రూత్ అనే షార్ట్ ఫిలిం లో నటించి మెప్పించింది. ఇంకా పెళ్లి కానీ యాష్మి ప్రస్తుతం నాగభైరవి సీరియల్ లో హీరోయిన్ గా మంచి నటన కనబరుస్తోంది. మ్యూజిక్ వినడం, డాన్స్ చేయడం అంటే ఈమెకు ఇష్టం. కారు కూడా ఉంది. యాష్మి 5అడుగుల 6అంగుళాల ఎత్తులో ఉంటుంది. సిరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తుంది.