పాపే మా జీవనజ్యోతి సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి ఎవరో తెలుసా?

Paape maa jeevana jyothi serial child artist :సినిమా రంగానికి ఏమాత్రం తీసిపోని రీతిలో బుల్లితెర మీద కార్యక్రమాలు,అందులో నటించే నటీనటులకు క్రేజ్ కనిపిస్తోంది. ఇక సీరియల్స్ లో నటించే వారికి వచ్చే రెస్పాన్స్ మాములుగా లేదు. పైగా చాలా ఛానల్స్ లో ఈమధ్య కొత్త కొత్త సీరియల్స్ కూడా స్టార్ట్ చేసారు. స్టార్ మాలో పాపే మా జీవనజ్యోతి సీరియల్ రాబోతోంది.

కన్నతల్లి దూరమైతే ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి అనే కాన్సెప్ట్ తో నడిచే ఈ సీరియల్ కి సంబంధించి ఇప్పటికే రిలీజైన ప్రోమో ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో బుల్లితెరకు బాగా పరిచయం ఉన్న పల్లవి రామ్ శెట్టి నటిస్తోంది. ఈమె చాలా సీరియల్స్ లో చేసింది. అలాగే లక్ష్మి కళ్యాణం సీరియల్ లో చేసిన ప్రియతమ్ చరణ్ కూడా ఈ సీరియల్ లో చేస్తోంది.

శ్రీ లలిత కూడా ఇందులో యాక్ట్ చేస్తోంది. ఈమె చాలా సీరియల్స్, మూవీస్ లో నటించింది. ఇక పల్లవి రామ్ శెట్టి కూతురు రోల్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మరియా. తన క్యూట్ యాక్షన్ తో ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తోంది. ఇంతకీ మరియా ఎవరంటే శ్రీలలిత కూతురే. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కల్సి నటిస్తున్నారు. అయితే తల్లిగా పల్లవి రామ్ శెట్టి చేస్తోంది.