రోజా నుంచి అనసూయ వరకు జబర్దస్త్ రెమ్యునరేషన్స్ ఎంతలా పెరిగాయో తెలుసా ?
jabardasth remuneration :తెలుగులో మొదటి నుంచి టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయే షో అనగానే ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గుర్తొస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు,రోజా జడ్జీలుగా వ్యవహరించి ఈ షో రక్తి కట్టిస్తూ వచ్చారు. ఇక కంటెస్టెంట్స్ కూడా తమ సత్తా చాటుతూ ఆర్ధికంగా కూడా నిలదొక్కుకున్నారు. ఈ ఒక్క షోతో వందల మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారు.
పదుల సంఖ్యలో కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. వారానికి రెండు రోజులు అన్నీ మరిచిపోయి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తోంది. కొందరు కంటెస్టెంట్స్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటేస్తున్నారు. ఓ వైపు జబర్దస్త్ షోతో పాటు బయట కార్యక్రమాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఈ షో నుంచి నాగబాబు తప్పుకున్నాక మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.
ముఖ్యంగా చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కూడా తమ షో రేటింగ్ పడిపోకుండా చాలా శ్రద్ధగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు,నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఈ షోలో రెమ్యునరేషన్స్ కూడా మారిపోయాయని టాక్. జడ్జిగా ఉంటున్న రోజా ఒక్కో ఎపిసోడ్‌కు 3 నుంచి 4 లక్షలు తీసుకునేదని వార్తలు వచ్చాయి.
అయితే నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఈమెకు రెమ్యునరేషన్ కంటే డబుల్ ఇస్తున్నారట. నెలకు 8 ఎపిసోడ్లు లెక్కేస్తే, రోజాకు 30 లక్షల వరకు అందుతున్నాయట. ఇక నాగబాబు అప్పట్లో 20 లక్షలకు పైగానే సంపాదించాడు. కానీ ఇప్పుడు ఆయన స్థానాన్ని మనోతో భర్తీ చేయడంతో ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 2 లక్షల వరకు ఇస్తున్నారట.
యాంకర్స్ రష్మి, అనసూయ ఎపిసోడ్‌కు 50 నుంచి 80 వేలు అందుకోగా, ఇప్పుడు లక్ష దాటేసిందని టాక్. అనసూయ ఒక్కో ఎపిసోడ్ కోసం 1.20 లక్షలు అందుకుంటోందట. సునామీ సుధాకర్, కెవ్వు కార్తిక్ కూడా లక్షల్లోనే అందుకుంటున్నారట. చమ్మక్ చంద్ర అప్పట్లో 3 నుంచి 4 లక్షలు సంపాదించాడు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ టీంకు కూడా దాదాపు 3 లక్షల వరకు ఉంటె ఇప్పుడు 4 లక్షల వరకు,హైపర్ ఆది టీమ్ కి 2.5 నుంచి 3 లక్షలకు హెచ్చిందని టాక్. అదిరే అభి 2 లక్షలు , రాకెట్ రాఘవ 2.75 లక్షల వరకు, భాస్కర్ అండ్ టీం 2 లక్షలు, చలాకీ చంటి 2 లక్షలు తీసుకుంటున్నారని టాక్.