రవితేజ సిస్టర్ గా చేసిన ఈ నటి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

idiot movie vidyavathi :ఇండస్ట్రీకి వచ్చిన చాలా ఏళ్లకు గానీ రవితేజ హీరోగా స్టార్ హోదా అందుకోలేదు. అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చాక మాత్రం వరుస విజయాలను అందుకుని మాస్ మహారాజ్ అయ్యాడు. ఎస్ ఎస్ రాజమౌళి తెరెకెక్కించిన విక్రమార్కుడు లాంటి మూవీస్ రవితేజ కెరీర్ ని అనూహ్యంగా మలుపు తిప్పాయి. అతడిలోని కామెడీ,యాంగ్రీ యాంగిల్ కూడా జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈమధ్య కొన్ని ప్లాప్ లు వచ్చినా మళ్ళీ క్రాక్ మూవీతో ట్రాక్ లోకి వచ్చాడు.

ఇక అప్పట్లో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇడియట్ మూవీ ఓ సెన్షేషన్. అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ,హీరోయిన్ రక్షిత నటించగా, రవితేజ చెల్లెలి పాత్రలో నటి విద్యావతి నటించింది. నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈమె తల్లిదండ్రులు ఆర్మీ విభాగంలో పని చేసేవారు. కాగా చిన్నప్పటినుంచి విద్యావతికి సినిమాల్లో నటించాలనే మక్కువ ఉండేది. స్కూల్లో చదువుతున్న సమయంలో కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనే క్రమంలో తెలిసిన వారి ద్వారా ఇడియట్ మూవీలో హీరో చెల్లెలి పాత్ర కోసం ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయింది.

ఆ తర్వాత మళ్లీ రవితేజ హీరోగా నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో కూడా రవితేజ చెల్లెలి పాత్రలో చేసి మెప్పించింది. కెరీర్ పరంగా సినిమా ఛాన్స్ లు పెరిగిపోతున్న సమయంలో స్టడీస్ పై దృష్టి పెట్టి,మూవీస్ కి బ్రేక్ ఇచ్చింది. స్టడీస్ పూర్తయ్యాక మా సిరి మల్లి మూవీతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా క్లిక్ అవ్వలేదు.

ఆ తర్వాత ఫోర్, ఎస్.పీ శంకర్, సిగ్నల్ తదితర చిత్రాలు ఫ్లాప్ కావడంతో సినిమా కెరియర్ దెబ్బతింది. 2017లో చివరగా కరణం, మే మై, అనే రెండు తమిళ చిత్రాలలో మెరిసింది. ప్రస్తుతం విద్యావతి సినిమా ఛాన్స్ లు రాక ఇంటి వద్దే ఖాళీగా ఉంటోందట. ఇక ఇడియట్ మూవీలో రవితేజ, రక్షిత అలాగే ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, శ్రీనివాస్ రెడ్డి, అలీ తదితరులు తమ నటనతో మెప్పించారు.