రుద్రమదేవి సీరియల్ సుమతీదేవి రియల్ లైఫ్…నమ్మటం కష్టమే

Star maa Rudramadevi serial Sumathi devi :వినోదాత్మక కార్యక్రమాలతో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్న స్టార్ మా ఛానల్ గత జనవరి 18నుంచి ప్రసారం చేస్తున్న రుద్రమదేవి సీరియల్ కి మంచి ఆదరణ లభిస్తోంది. సాటిలేని మహారాజు ట్యాగ్ లైన్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.

ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ రాత్రి 9గంటలకు స్టార్ మాలో ఈ సీరియల్ ప్రసారమవుతోంది. ఈ సీరియల్ లో సుమతీదేవి పాత్రపోషిస్తున్న వ్యక్తి గురించి ప్రస్తావిస్తే, ఈమె పూర్తిపేరు జయకవి ఆగం. తమిళనాడులో జన్మించిన ఈమె స్టడీస్ అక్కడే పూర్తిచేసింది.

క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం కావడంతో చిన్ననాటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. భారతనాట్యంలో ఆరితేరిన ఈమె మంచి డాన్సర్. కొరియోగ్రాఫర్ కూడా.తూర్పు పడమర సీరియల్ లో యాక్ట్ చేసింది. అలా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె రుద్రమదేవి సీరియల్ లో చేస్తోంది. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతుంది.