MoviesTollywood news in telugu

కృష్ణకు ఎన్టీఆర్ ఇచ్చిన మంచి సలహా…ఏమిటో తెలుసా?

NTR advice to Supersta Krishna :తెలుగు చిత్ర సీమలో కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు తీసుకు రావడమే కాకుండా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణ ముద్రపడ్డారు. ఇక 100వ చిత్రంగా తీసిన అల్లూరి సీతారామరాజు మూవీ ద్వారా కలర్, స్కోప్ మూవీస్ కి తెలుగులో శ్రీకారం చుట్టారు. మిగిలిన ప్రొడ్యూసర్లు కూడా అదే బాటలో వెళ్లడంతో 1978లో అత్యధిక స్థాయికి చేరింది. ఆ ఏడాది ఏకంగా 17స్కోప్ మూవీస్ వచ్చాయి. ఇందులో సింహభాగం కృష్ణ చిత్రాలే కావడం విశేషం. నలుగురు వైద్యులు కల్పి నిర్మించిన చెప్పింది చేస్తా మూవీలో కృష్ణ హీరోగా చేస్తూ, లెక్చరర్ పాత్ర వేశారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలిగా జయచిత్ర నటించింది.

నటుడు సురేష్ తండ్రి గోపీనాధ్ ఈ మూవీకి డైరెక్టర్. కృష్ణ సినిమా అనగానే డేరింగ్ , డాషింగ్ సీన్స్ ఉంటాయి. అయితే గోపీనాధ్ మరో అడుగు ముందుకేసి పులితో పోరాడే సన్నివేశాలు పెట్టారు. హీరోయిన్ జయచిత్ర కూడా పులితో చేసే ఫైట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిల్చింది. ఈ షూటింగ్ జరిగే పక్కనే వాహినిలో యుగపురుషుడు షూటింగ్ ఎన్టీఆర్ తో తీస్తున్నారని కృష్ణకు తెల్సింది. కురుక్షేత్రం, దానవీర సూర కర్ణ మూవీతో ఇద్దరి మధ్యా ఏర్పడ్డ మనస్పర్థలు తొలగిపోవాలని ఎన్టీఆర్ షూటింగ్ సెట్ లోకి కృష్ణ అడుగుపెట్టారు.

ఇది చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. ఏడాదిన్నర తర్వాత ఇద్దరూ కలుసుకున్న సన్నివేశం అదే. దాంతో ఎన్టీఆర్ లేచి నిలబడి రండి బ్రదర్ అని ఆహ్వానించారు. పక్కనే కూర్చున్నాక,మీ ఇద్దరు కొడుకులు రమేష్,మహేష్ బయట చిత్రాలకు కూడా చేస్తున్నట్లున్నారు అని ఎన్టీఆర్ అడిగితె , అవునని కృష్ణ బదులిచ్చాడు. ‘అలా వద్దు, ముందు చదువు ముఖ్యం. బయట చిత్రాలు వద్దు’అని ఎన్టీఆర్ చెప్పడంతో అలాగే అన్నగారు అని కృష్ణ బదులిచ్చారు. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చ జరిగింది. మీ స్టూడియో బయట చిత్రాలకు ఇస్తున్నారా అని కృష్ణ అడగ్గా లేదు బ్రదర్, మాకే సరిపోవడం లేదు అని చెప్పారు. మా స్టూడియో చూసారా అని ఎన్టీఆర్ అడిగితె లేదండి బయటనుంచి చూసాను, మీరు లేరని రాలేదు అని కృష్ణ చెప్పారు. తర్వాత ఎవరి సెట్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు. ఆలా ఇద్దరి మధ్యా రాకపోకలు యదావిధిగా సాగాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."