MoviesTollywood news in telugu

సినిమాల్లో కనిపించే రక్తం నిజమేనా…నమ్మలేని నిజాలు

Real blood is used in cinema shootings :చాలా సినిమాల్లో ముఖ్యంగా ఫైటింగ్ సీన్లలో రక్తం ఏరులై పారుతుంది టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఇలా అన్ని భాషల సినిమాల్లోనూ రక్త ప్రవాహం ఎక్కువగానే ఉంటుంది. బాలయ్య సినిమాల విషయానికొస్తే రక్తం లేకుండా ఆయన సినిమాలు ఉండవు ప్రతి సినిమాలోను రక్తప్రవాహం ఉండాల్సిందే. మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది.

అసలు ఈ రక్తం ఎక్కడి నుంచి తెస్తారు ఇది నిజమైన రకమైన అని సందేహం ఉంటుంది అయితే ఇది నిజమైన రక్తం కాదు కృత్రిమంగా తయారుచేసే ద్రావణం. దీనికి గ్రాఫిక్ హంగులు జోడించి నిజమైన రక్తం అనిపించేలా చేస్తారు. అసలీ రక్తాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఈ రక్తం మరీ చిక్కగా ఉండదు అలాగని పలుచగా కూడా ఉండదు.

కార్న్ సిర‌ఫ్ మరియు ఒప్యాస్టి పైర్ రెండింటినీ బాగా కలిపి దానికి రెడ్ కలర్ కలుపుతారు. ఆ తర్వాత ఇలా త‌యారైన ఆ ద్రావ‌ణంలో న‌లుపు లేదంటే నీలం రంగును మిక్స్ చేస్తారు. ఇలా తయారుచేసిన ద్రావణం ఆ ద్రావ‌ణం నిజ‌మైన ర‌క్తంలా క‌నిపిస్తుంది. దీన్ని సీసాల్లో నిల్వ చేస్తారు. ఎన్ని రోజులు అయిన నిల్వ ఉంటుంది. వీటిని సినిమా పరిశ్రమకు సరఫరా చేస్తారు. దీని కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.