హీరో – డైరెక్టర్ హిట్ కాంబినేషన్ సినిమాలు చూడండి
Actors and Directors Best Combination in Tollywood :ఎన్టీఆర్ , కె రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే చెప్పక్కర్లేదు. అడవి రాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.
అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కాంబోలో ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. రజనీకాంత్ , కె బాలచందర్ కాంబోలో అంతులేని కథ, మరోచరిత్ర, వంటి దాదాపు 30కి పైగా సినిమాలు వచ్చాయి.
సూపర్ స్టార్ కృష్ణ, కె ఎస్ ఆర్ దాస్ కాంబోలో 30కి పైగా సినిమాలు వచ్చాయి. మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్ బ్యాండ్ 777, దొంగలవేట, అన్నదమ్ముల సవాల్, వంటి హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి.
అందాల నటుడు శోభన్ బాబు, వి మధుసూదనరావు కాంబోలో దైవబలం, జగమొండి, మల్లెపూవు, జేబుదొంగ వంటి 12హిట్ మూవీస్ వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి,ఏ కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో 20పైగా సినిమాలు వచ్చాయి . దాదాపు అన్నీ హిట్స్ . ఖైదీ సినిమా ఇప్పటికీ ఆణిముత్యం. ఇప్పటి తరంలో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150సినిమాలు చిరు, వివి వినాయక్ కాంబినేషన్ లో సెన్షేషన్ క్రియేట్ చేసాయి.
డాక్టర్ రాజశేఖర్ , కోడి రామకృష్ణ కాంబోలో తలంబ్రాలు, అంకుశం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ . తర్వాత వి సముద్ర డైరెక్షన్ లో రాజశేఖర్ నటించిన సింహరాశి,ఎవడైతే నాకేంటి సినిమాలు హిట్ కొట్టాయి.
బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ కి క్రేజ్ ఉంది. సింహా, లెజెండ్ మూవీస్ ఇందుకు ఉదాహరణ.
సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్,డైరెక్టర్ వంశీ కాంబోలో ఏప్రియల్ 1విడుదల, లేడీస్ టైలర్, కన్నయ్య కిట్టయ్య వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.
అలాగే నరేష్ ,జంధ్యాల కాంబోలో నాలుగు స్తంభాలాట, బావా బావా పన్నీరు వంటి సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి.
స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నుంచి యమదొంగ వరకూ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ కి క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. అందుకే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈవీవీ సత్యనారాయణ, అల్లరి నరేష్ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు ఇప్పటికీ టీవీల్లో మంచి టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్నాయి.
అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబో మొదటి నుంచి హిట్. ఆర్య, ఆర్య 2, ఇప్పుడు పుష్ప.
క రామ్ చరణ్, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ బలమైనదని మగధీర, ఆర్ ఆర్ ఆర్ రుజువుచేస్తున్నాయి.