అటు NTR ఇటు KRISHNA మధ్యలో జయప్రద…విషయం ఏమిటో…?

Ntr And Krishna :నటరత్న ఎన్టీఆర్, సూపర్ కృష్ణ సినిమాలు పలు సందర్భాల్లో పోటీ పడ్డాయి. 1978లో ఇలాంటి సందర్భం ఎదురైంది. ఎన్టీఆర్ నటించిన యుగపురుషుడు మూవీ రిలీజ్ అయినపుడే కృష్ణ నటించిన దొంగలవేట సినిమా రిలీజయింది. ఈ రెండు సినిమాల్లో జయప్రద హీరోయిన్. ఇద్దరు మాస్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఒకేరోజు ఇద్దరి సినిమాలు విడుదల కావడంతో ఇద్దరి ఫాన్స్ కూడా తమ హీరోదే పైచేయి అంటూ వాదనకు దిగేవారు.

కొన్ని సెంటర్స్ లో ఇద్దరి ఫాన్స్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఎదురులేని మనిషి మూవీతో నిర్మాతగా మారి ఎన్టీఆర్ తో తీసిన రెండవ సినిమా యుగపురుషుడు. కె బాపయ్య డైరెక్టర్. 55ఏళ్ళ వయస్సులో చలాకీగా పైగా కరాటే ఫైటర్ గా ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాల్లో డ్రెస్సులకు విజయవాడ యాక్స్ టైలర్ వాలేశ్వరరావు ప్రత్యేకంగా దుస్తులు రూపొందించారు. షర్ట్ కి పైన మూడు గుండీలు వదిలేసి, బెల్ బాటమ్ ఫాంట్ తో ఎన్టీఆర్ ని చూస్తే, 30ఏళ్ల వయసు తగ్గిందా అన్పించింది.

హిందీలో హిట్ అయిన సినిమా ఆధారంగా దొంగలవేట సినిమా కె ఎస్ ఆర్ దాస్ డైరెక్షన్ లో వచ్చింది. సెంటిమెంట్ జోడించి క్రైమ్ చిత్రంగా తీసిన దొంగలవేటలో కృష్ణ సిఐడి ఆఫీసర్. కుక్కలతో ఛేజింగ్,హెలికాఫ్టర్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. జయప్రద గ్లామర్ సరే. బాలీవుడ్ నటుడు జితేంద్ర ఓ సన్నివేశంలో మెరుస్తారు. మొత్తానికి రెండు చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.