MoviesTollywood news in telugu

బుల్లితెరపై రాణిస్తున్న వెండితెర నటుల వారసులు

Tollywood Tv Actors : ఋతురాగాలు సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన శృతి లింగంపల్లి పలు సినిమాలతో పాటు సీరియల్స్ లో నటిస్తున్నారు. చక్రవాకం, నాగాస్త్రం,కన్యాశుల్కం వంటి సీరియల్స్ లో నటించారు. తెలుగు సీరియల్ నటి నాగమణి కుమార్తె అయినా శృతి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సంఘర్షణ సీరియల్ తో కెరీర్ స్టార్ట్ చేసిన హరిత ప్రస్తుతం నీ వల్లే నీ వల్లే,కుంకుమ పువ్వు వంటి సీరియల్స్ లో నటిస్తోంది. ఈమె తెలుగు హీరోయిన్ రవళి కి అక్కయ్య. ఈమె భర్త జాకీ కూడా సీరియల్ నటుడే.

తెలుగులో విలక్షణ నటుడుగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకరరావు మాల్గుడి డేస్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి, పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం గౌరమ్మ అనే తెలుగు సీరియల్ లో నటిస్తున్నారు. వెండితెర హాస్య నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు సినిమాలతో పాటు తెలుగు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. జానకి కలగనలేదు సీరియల్ లో ప్రస్తుతం నటిస్తున్నారు.

సినిమా రచయిత, నటుడు ఓంకార్ కుమారుడైన నిరుపమ్ పరిటాల ప్రస్తుతం కార్తీకదీపం, హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్స్ నటిస్తున్నాడు. వెండితెర అమ్మవారి గా కీర్తిగాంచిన కె ఆర్ విజయ సోదరి సావిత్రి గారి కుమార్తె అయిన అనూష పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం బుల్లితెరపై నటిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."