MoviesTollywood news in telugu

హీరో విశ్వక్ సేన్ క్రష్ ఎవరో తెలుసా..?

Tollywood Hero vishwak sen :కరోనా తగ్గిందనుకుంటున్న తరుణంలో మళ్ళీ సెకండ్ వేవ్ భయంతో వణికిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సినిమా హాల్స్ కూడా మళ్ళీ మూసేస్తున్నారు. ఎపి లాంటి చోట్ల 50శాతం కెపాసిటీతోనే అనుమతిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమాల విడుదల మరింత జాప్యం జరిగే ఛాన్స్ ఉందని టాక్. కాగా ఫలక్ నమా దాస్,హిట్ సినిమాలు సక్సెస్ కావడంతో పాటు నటుడిగా మార్కెట్ పెంచుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం తమిళ రీమేక్ మూవీ చేస్తున్నాడు.

ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్తయిన ఈ మూవీ కరోనా తగ్గితే, షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు విశ్వక్ సేన్ బదులిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. సినిమా రంగంలోకి రాకముందు వచ్చాక కూడా ఒకే రకమైన అభిప్రాయం ఉందని చెప్పాడు.

కరోనా సెకండ్ వేవ్ భయంగా ఉందన్నాడు. కరోనా వలన పాగల్ మూవీ ట్రైలర్ లేట్ అవుతుందని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇక పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేయడం విశేషం. లాక్ డౌన్ సమయంలో తన పని గురించి ఎక్కువ ఆలోచించినట్లు చెప్పాడు. క్రష్ గురించి అడిగిన ప్రశ్నకు గోవా బ్యూటీ ఇలియానా పేరు చెప్పాడు.