MoviesTollywood news in telugu

ఈ నటుడు టాప్ డైరెక్టర్ అల్లుడు అని మీకు తెలుసా?

Tollywood Director K Vijaya Bhaskar :ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకెళ్లిన దర్శకుడు కె విజయ్ భాస్కర్ గత కొన్నేళ్లుగా సినిమాలు చేయడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడయ్యాక విజయ్ భాస్కర్ శైలి దెబ్బతిని, సినిమా ఛాన్స్ లు రావడం మానేశాయి. ఎందుకంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథ అందిస్తుంటే, విజయభాస్కర్ చేసిన స్వయంవరం,నువ్వే కావాలి,నువ్వు నాకు నచ్చావ్,మల్లీశ్వరి,మన్మథుడు లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవితో చేసిన జై చిరంజీవ కూడా హిట్ జాబితాలో కాకున్నా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది.

అందుకే విజయభాస్కర్ పేరు అప్పట్లో సంచలనం. ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలను చేసాడు. అయితే ఆ తర్వాత విజయ్ భాస్కర్ తీసిన భలే దొంగలు,మసాలా సినిమాలు అంచనాలు అందుకోలేదు. ప్రేమ కావాలి బాగానే నిల్చింది.

ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే విజయభాస్కర్ కి ఓ కొడుకు,ఓ కూతురు ఉన్నారు. విజయ్ భాస్కర్ అల్లుడు గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈయన వారసుడుగా అల్లుడు రవి శివ తేజ పైలా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తారని టాక్. వెబ్ సిరీస్‌లతో పాటు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్న రవి,ఈ మధ్యే షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో వచ్చిన సూర్య వెబ్ సిరీస్‌తో స్వామి పాత్రతో వెలుగులోకి వచ్చాడు.

ఈ సిరీస్‌తో రవి మేజర్ బ్రేక్ కూడా అందుకున్నాడు. ఇంతకీ అసలు విషయమేమిటంటే, బ్యాగ్రౌండ్ చూసుకోకుండా తన కూతురు ప్రేమించినందుకు తన రేంజ్ కి సరిపోక పోయినప్పటికీ రవి శివ తేజను విజయ భాస్కర్ అల్లుడిగా చేసుకున్నాడు. జిమ్‌లో పరిచయమైన రవి,శ్యామ ప్రేమలో పడ్డారు. ఇంట్లో చెప్పిన దాదాపు 7 నెలల తర్వాత ఈ ఇద్దరికి పెళ్లి చేసి, విజయ భాస్కర్ ఆదర్శంగా నిలిచాడు. తన మావయ్య చాలా కూల్ అని, చాలా మంచివారని రవి చెప్తున్నాడు. సాధారణంగా విజయ్ భాస్కర్ లాంటి సీనియర్ దర్శకుడి అల్లుడు అంటే మినిమమ్ రేంజ్ కోసం చూస్తారు. అయితే తన కూతురు శ్యామని ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి,అందరి మన్ననలు అందుకున్నాడు.