MoviesTollywood news in telugu

అక్కినేని కోడలు లైఫ్ ని మార్చేసిన సినిమా ఏమిటో తెలుసా?

samantha akkineni :టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. నిజానికి తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో దూసుకుపోతోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాకు ఓకే చెప్పడంతో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని తెలుగు,తమిళంతో పాటు హిందీ భాషలలోను విడుదల చేసేలా పాన్ ఇండియా మూవీగా రోపొందిస్తున్నట్లు టాక్.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా రాణిస్తున్న సామ్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ,వెబ్ సిరీస్‌ లో నటిస్తోంది. ఆహా ఓటిటి ద్వారా ప్రముఖ నటులను ఇంటర్వ్యూ చేస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ అనే పాపులర్ వెబ్ సిరీస్ రెండవ సీజన్‌లో కీలకపాత్రలో మెరవబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలో స్ట్రీమ్ కానుందని అమోజాన్ ప్రకటించింది.

అక్కినేని నాగచైతన్య నటించిన ఏమాయ చేసావె మూవీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చింది. ఈ మూవీని మంజుల నిర్మించగా, ఈ మూవీతోనే సామ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి, కుర్రకారుని తనదైన మాయలో పడేయడమే కాదు,నాగచైతన్యని కూడా లవ్ లో పడేసింది. మొత్తానికి ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒకే చెప్పడంతో 17 ఆక్టోబర్ 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆవిధంగా తెలుగులో తొలిసినిమా సామ్ జీవితాన్ని మార్చేసింది.