అఖండ సినిమాకి బోయపాటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

akhanda Movie Boyapati remuneration : కొన్ని కాంబినేషన్స్ బాగా కల్సి వస్తాయి. అందులో బోయపాటి శ్రీనివాస్, నందమూరి నటసింహం బాలయ్య కాంబినేషన్ ఒకటి. సింహా, లెజెండ్ మూవీస్ ఇందుకు ఉదాహరణ. అయితే విజయవిధేయ రామ మూవీ ప్లాప్ తో బోయపాటి కి మార్కెట్ డౌన్ అయింది. దాంతో పోయినచోటే వెతుక్కోవాలన్న సామెతగా బాలయ్యతోనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో బాలయ్య – బోయపాటి కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే టాక్ ఇటు ఇండస్ట్రీ లో అటు ఆడియన్స్ లో నెలకొంది. ఇక ఎలాగోలా బాలయ్యతో అదిరిపోయే హ్యా్ట్రిక్ కొట్టి తీరుతానని మోస్ట్ కాన్ఫిడెంట్‌గా బోయపాటి ఉన్నాడు.

అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బోయపాటి, బాలయ్య కోసం పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేసి, అఖండ అనే టైటిల్‌ కూడా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అఖండ చిత్రాన్ని ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడో, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు చూస్తే అర్ధం చేసుకోవచ్చు.బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ టైటిల్ టీజర్‌కు అనూహ్యంగా రెస్పాన్స్ రావడంతో బోయపాటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్.

బాలయ్య చిత్రంలో ఏయే అంశాలు ఉండాలో వాటన్నింటినీ పక్కాగా ఉండేలా ప్లాన్ చేసాడట. తొలుత అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఖర్చవుతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. దీంతో ఈ సినిమాలో పనిచేస్తున్న వారు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటున్నట్లు టాక్. బాలయ్య కూడా తన రెమ్యునరేషన్‌ను రూ.10 కోట్ల నుండి రూ.7 కోట్లకు తగ్గించాడట. ఇక దర్శకుడు బోయపాటి అయితే రెమ్యునరేషన్ కాకుండా షేర్స్‌లో వాటా తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.