Healthhealth tips in telugu

చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నారా…లేకపోతే…!?

Hand Wash :చేతులు కడుక్కోవటం అంటే…ఏదో కాస్త సబ్బు రాసుకొని గబగబ కడిగేసుకుంటారు చాలా మంది. కానీ చేతులను కడుక్కోవటానికి కూడా ఒక పద్ధతి ఉంది. చాలా మంది పది సెకండ్ల లోపే చేతులను కడిగేస్తూ ఉంటారు. కానీ చేతులను కనీసం 20 నుంచి 30 సెకన్ల పాటు కడగాలని నిపుణులు చెప్పుతున్నారు.

ముందుగా చేతులను నీటి దార కింద తడపాలి. ఆ తర్వాత సబ్బు తో నురగ వచ్చే వరకు రుద్దాలి.

చేతులు కడుక్కోవటం అనేది కేవలం అరచేతులనే కాకుండా వేళ్ళ మధ్యన,చేయి వెనక కూడా సబ్బుతో బాగా రుద్దాలి. ఆ తర్వాత నీటి ధార కింద చేతులను పెట్టి  సబ్బు నురగ పోయే విధంగా బాగా కడగాలి.

ఉంగరాలు ధరించే వారైతే ఉంగరాలను తీసి చేతులను శుభ్రంగా కడుక్కున్నాక పెట్టుకోవటం ఉత్తమం.

పొడవాటి గోళ్ళు ఉన్నవారైతే చేతులను కడుక్కొనే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోళ్ళల్లో బ్యాక్టీరియా,వైరస్ ఎక్కువగా చేరే అవకాశం ఉంది. కాబట్టి గోళ్ళలలో మట్టి,మురికి లేకుండా శుభ్రం చేసుకోవటం ముఖ్యం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే…గోళ్ళను పొడవుగా పెంచుకోకపోవటమే మంచిది.