Beauty Tips

జుట్టు రాలకుండా ఉండాలంటే….క్యారట్ హెయిర్ ప్యాక్స్

Hair Fall Tips In Telugu :రెండు క్యారట్ లను తీసుకోని మెత్తగా ఉడికించాలి. ఆ నీటితో పాటే క్యారట్ ను మెత్తని పేస్ట్ గా చేయాలి. దీనిని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

రెండు క్యారట్ లను తీసుకోని రసాన్ని తీసి పక్కన పెట్టాలి . ఒక బౌల్ లో రెండు స్పూన్లతేనే,ఒక స్పూన్ ఆలివ్ నూనె,ఒక స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ తీసుకోని కొద్దిగా వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని పైన తయారుచేసుకున్న క్యారట్ రసంలో కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి,రాత్రంతా షవర్ క్యాప్ పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ జుట్టును దృడంగా ఉంచుతుంది.

ఒక క్యారట్,ఒక అరటిపండును తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కోసి కొంచెం ఆలివ్ ఆయిల్వే సి మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.