MoviesTollywood news in telugu

హీరోయిన్ కళ్యాణి గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Heroine kalyani Facts :సినిమా పరిశ్రమలో కళ్యాణి తన అందం, అభినయంతో మంచి పాత్రల్లో నటిస్తూ, ప్రాధాన్యత గల పాత్రలతో ఆడియన్స్ లో పేరు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, పెద్దయ్యాక హీరోయిన్ గా సౌత్ లో అన్ని భాషల్లో నటించింది. శేషు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ సూర్య కిరణ్ ని పెళ్లి చేసికుంది.

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీలో నటించిన కల్యాణి ఉత్తమ నంది అవార్డు అందుకుంది. జగపతి బాబు, వెంకటేష్ లతో ఎన్నో సినిమాల్లో చేసింది. ముఖ్యంగా జగపతి బాబుతో పలు సినిమాల్లో చేసి, బెస్ట్ ఫెయిర్ గా గుర్తింపు పొందారు. పెళ్లయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. లక్ష్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో కావేరిగా పాపులర్ అయింది. అందుకే కళ్యాణి కావేరిగా మార్చుకుంది.

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు పొందిన కళ్యాణి తల్లిగా, వదినగా కూడా నటించింది. అయితే మళ్ళీ సినిమాలకు దూరమై ఇప్పుడు డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. చేతన్ శ్రీను అనే హీరోని పరిచయం చేయబోతోంది. సుహాసిని,సిద్ధూ,రోహిత్ మురళి,శ్వేతా మురళి ప్రధాన పాత్రలు వేస్తున్నారు. పూరి జగన్నాధ్ తొలి పోస్టర్ లాంచ్ చేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."