రియల్ స్టార్ శ్రీహరి, ప్రకాష్ రాజ్ మధ్య రిలేషన్ ఏమిటో…?

Srihari And Prakash Raj :తెలుగు సినీ పరిశ్రమలో ప్రకాష్ రాజ్ శ్రీహరి  ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా హీరోగా నటించి మెప్పించారు శ్రీహరి అయితే రియల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. శ్రీహరి ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రలు మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రకాష్ రాజ్ ఒక తండ్రిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎన్నో పాత్రలను పోషించి ఒక మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు అయితే శ్రీహరి ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న రిలేషన్  ఏమిటో తెలుసుకుందాం

శ్రీహరి భార్య డిస్కోశాంతి ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి. వీరిద్దరూ అక్కాచెల్లెళ్ళు తండ్రి ఆనంద్ కన్నడ తమిళ మలయాళ పరిశ్రమలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  విలన్ గా నటించి మెప్పించారు ఈయన కూతుర్ల లో పెద్దమ్మాయి లలితకుమారి ని ప్రకాష్ రాజు కిచ్చి వివాహం చేశారు రెండో అమ్మాయి డిస్కో శాంతి శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీహరి ప్రకాష్ రాజ్ ఇద్దరు తోడల్లుడు అయ్యారు వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.