Healthhealth tips in telugu

కరోనా సమయంలో మిరియాలు తీసుకుంటున్నారా…ఈ నిజం తెలుసుకోండి

Black pepper In Telugu :కరోనా రోజురోజుకి తన ప్రతాపాన్ని చూపి ప్రతి ఒక్కరికి వణుకు పుట్టిస్తుంది. కరోనా నుంచి రక్షణ కలగాలంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు చెప్పుతున్నారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచటంలో మిరియాలు కీలకమైన పాత్రను పోషిస్తుంది. మిరియాలలో ఉండే పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్స్ రోగ కారకాలను నిర్మూలిస్తాయి. అయితే మిరియాలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం,.

మిరియాలను నెయ్యిలో వేగించి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని పాల‌లో అరస్పూన్ మిరియాల పొడిని కలుపుకొని ఉద‌యాన్నే తాగితే జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.ఇలా ప్ర‌తిరోజు చేయ‌డం వ‌ల్ల‌ శరీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా బ‌ల‌ప‌డ‌తుంది.

క‌రోనా వంటి ప్రాణాంత‌క వైర‌స్‌ల‌ను సులువుగా ఎదుర్కోగ‌ల‌రు.అలాగే కండరాలు, నరాల నొప్పులు, వాపులు, త‌ల‌నొప్పి, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలోనూ మిరియాలు అద్భుతంగా ప‌నిచేస్తాయి.