MoviesTollywood news in telugu

కరోనా సమయంలో లవర్ బాయ్ తరుణ్ పెళ్లి…అమ్మాయి ఎవరో తెలుసా ?

Tollywood Hero Tarun :నువ్వేకావాలి సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తరుణ్ లవర్ బాయ్ గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఎంత మంది హీరోలు వచ్చినా లవర్ బాయ్ అంటే ప్రతి ఒక్కరికి తరుణ్ గుర్తుకొస్తాడు. తరుణ్ ప్రముఖ నటి రోజారమణి కొడుకు. తరుణ్ బాల నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు అవన్నీ సక్సెస్ అయ్యాయి హీరోగా చేసిన సినిమాలు కూడా కొన్ని సక్సెస్ అయ్యాయి ప్రియమైన నీకు నువ్వే నువ్వే నువ్వు లేక నేను లేను వంటి సినిమాలు తరుణ్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి

ఇక ఆ తర్వాత తరుణ్ కెరీర్ గాడి తప్పింది. 25 సంవత్సరాలకే స్టార్ డమ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత సినిమా కథల ఎంపికలో లోపాలు జరగటం మరియు కొత్త కొత్త హీరోలు రావటంతో పోటీ పెరగడంతో తరుణ్ సైడ్ అయ్యాడు. ప్రస్తుతం తరుణ్ బిజినెస్ చేసుకుంటూ చాలా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇప్పుడు మళ్లీ తరుణ్ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తరుణ్ కోసం వాళ్ళ అమ్మ రోజా రమణి చాలా రోజుల నుంచి మంచి సంబంధం కోసం చూస్తుంది తన స్నేహితురాలి కూతుర్ని తరుణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది అని వార్తలు జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.