చిలకడ దుంప ఇమ్మ్యూనిటి పెంచి కరోనాకు చెక్ పెడుతుందా…దీనిలో వాస్తవం ఎంత ?

sweet potato benefits In Telugu :మనలో చాలా మందికి చిలకడ దుంప గురించి తెలుసు. కొంతమంది ఉడికించుకొని తింటే కొంతమంది కాల్చి తింటారు. అలాగే కూరగా చేసుకొని కూడా తింటూ ఉంటారు. అంతేకాకుండా పులుసులో కూడా వేస్తారు. చిలకడ దుంపలో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది తినటానికి ఇష్టపడరు. ఇది చదివితే తప్పనిసరిగా చిలకడ దుంప తింటారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంటే కరోనా విజృభిస్తున్న సమయంలో చిలకడ దుంప తినమని నిపుణులు చెప్పుతున్నారు.

చిలగడ దుంపలు మన శరీరానికి అవసరమైన మినరల్, ఐరన్ పుష్క‌లంగా ఉంటాయి.ఇవి తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో స‌హాయ‌ప‌డ‌తాయి.త‌ద్వారా క‌రోనా వంటి అనేక వైర‌స్‌ల‌తో పోరాడే రోగనిరోధక శ‌క్తి పెరుగుతుంది.అంతేకాకుండా చిలకడ దుంపలో ఉండే విట‌మిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

ఇక సూర్య‌ర‌శ్మి నుంచి వ‌చ్చే విట‌మిన్ డి.చిల‌గ‌డ దుంప ద్వారా కూడా పొందొచ్చు.ఇందులో విట‌మిన్ డి పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల‌.అనేక జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంతో పాటు బలమైన ఎముకలను కూడా ప్రోత్సహిస్తుంది.మ‌రియు క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా చిలగడ దుంపల్లో ఉంటాయి. కాబట్టి చిలకడ దుంపను వారంలో మూడు సార్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు. ఈ విధంగా మనకు లభ్యం అయ్యే ఆహారాలతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.