MoviesTollywood news in telugu

కరోనా సెకండ్ వేవ్ తో ప్రొడ్యూసర్స్ కి నష్టం ఎంతో తెలుసా?

Corona Effect Tollywood Movies :ఏ ముహూర్తాన కరోనా మహమ్మారి వచ్చిందో గానీ గత ఏడాది ఇంచుమించు అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక సినిమా రంగం టోటల్ బంద్ అయింది. డిసెంబర్ లో థియేటర్లు తెరవడం, అప్పటికే మెల్లిగా షూటింగ్స్ మొదలవ్వడంతో మళ్ళీ నిలదొక్కుకుంటామన్న ఆశలు రేకెత్తాయి. కానీ ఏప్రియల్ చివరి వారానికి సెకండ్ వేవ్ ఉధృతికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పడుకుంది. థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి.

కొందరు హీరోలకు, హీరోయిన్స్ కి, డైరెక్టర్స్ కి కూడా కరోనా సోకింది. ఇండస్ట్రీలో కొందరు కరోనా కాటుకి బలయ్యారు. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబోలో ఆచార్య, బాలయ్య – బోయపాటి శ్రీనివాస్ కాంబోలో అఖండ, వెంకటేష్ నారప్ప, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్, ప్రభాస్ రాధేశ్యాం ఇలా ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్ మూవీస్.

ఈ సినిమాలన్నీ చివరి దశకు చేరి, రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు. ఇంతలోనే మహమ్మారి మళ్ళీ విజృంభించింది. వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ సినిమా పడలేదు. అసలు ఏదైనా సినిమా తీయాలంటే నిర్మాత ఎన్నో కష్టాలు పడాలి. ఫైనాన్షియర్స్ దగ్గర,డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర పెట్టుబడులకోసం నానా తంటాలు పడాలి. వాటికి వడ్డీలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి సెకండ్ వేవ్ నిర్మాతల పాలిట శాపంగా పరిణమించింది. ఎన్ని వేలకోట్ల నష్టమో చెప్పడం కష్టంగా ఉంది.