MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ల సీక్రెట్స్ మీకు తెలిస్తే షాక్ అవుతారు

Tollywood Heroines : ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా వారికి కూడా కొన్ని ఇష్టా ఇష్టాలు ఉంటాయి. వ్యక్తిగతంగా వాళ్ళు కొన్ని పనులు చేయడానికి ఇష్టపడతారు. మన స్టార్ హీరోయిన్స్ విషయంలోకి వస్తే, అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత కు వంట చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదట. హీరోయిన్ నిత్యా మీనన్ ఎలాంటి పాత్రలోనైనా లీనమై నటిస్తూ, మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కథలు కూడా రాయగలిగిన ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గితే, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వైపు అడుగులు వేస్తుందట.

మిల్కి బ్యూటీ తమన్నా కవితలు రాయడంలో మంచి ఆసక్తి చూపిస్తుందట. ఆమె రాసిన కవితలతో ఓ పుస్తకం తేవాలని చూస్తోంది. హీరోయిన్ నభా నటేష్ హీరోయిన్ గా రాణించడమే కాదు, మంచి చిత్రాలు కూడా గీస్తుందట. టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్ కు అద్దం అంటే చాలా ఇష్టంకావడంతో ఎన్ని గంటలైనా అద్దం ముందు నిలబడి అలానే చూస్తూ ఉంటుందట. హీరోయిన్ రాధికా ఆప్టేకు కథలు రాయడం వచ్చు. స్క్రీన్ ప్లే కూడా రాయాలని భావిస్తోంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఆఫర్లతో రాణిస్తున్న నిధి అగర్వాల్ కుడి చేతితో పాటు ఎడమ చేతితో కూడా రాయగలదు. ఇలా రెండు చేతులతో రాసే ప్రతిభ తక్కువమంది హీరోయిన్లకు మాత్రమే ఉంటుంది. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ నటి కావడంతో పాటు సింగర్ కూడా. ఈమె ఆర్గానిక్ సబ్బులను తయారు చేయడంతో పాటు వాటిని ఇష్టమైన వారికి బహుమతులుగా ఇస్తుందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."