MoviesTollywood news in telugu

శోభన్ బాబు సినిమా టైటిల్స్ తో ఎన్ని సినిమాలు ఉన్నాయో…?

Sobhan Babu Movies :దాసరి నారాయణరావు, శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన స్వయంవరం సినిమా ఎంతటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు. ఇందులో జయప్రద హీరోయిన్. గాలివానలో వాననీటిలో .. సాంగ్ సూపర్ హిట్. అయితే ఇదే టైటిల్ తో వేణు, లయ జంటగా వచ్చిన సినిమా కూడా బాగానే ఆడింది. ఇక బాపు డైరెక్షన్ లో వచ్చిన సంపూర్ణ రామాయణం మూవీ హిట్ అయింది. అయితే అంతకు ముందే ఎన్టీఆర్ తో సంపూర్ణ రామాయణం మూవీ ఉంది. అలాగే బి ఎల్ నారాయణ సినిమా కూడా ఇదే టైటిల్ తో ఉందట.

శోభన్ బాబు నారదుడిగా వేసిన సతీ అనసూయ సినిమా వచ్చింది. అయితే ఇదే టైటిల్ తో ఎన్టీఆర్, అంజలీదేవి సినిమా కూడా అంతకుముందు వచ్చింది. దొరికితే దొంగలు శోభన్ బాబుకి ముందే ఎన్టీఆర్ సినిమా ఉంది. అలాగే తోడూ నీడా సినిమా కూడా శోభన్ బాబు, ఎన్టీఆర్ తో విడివిడిగా ఉంది. మాంగ ల్య బలం మూవీ శోభన్ బాబు జయసుధ జంటగా వచ్చింది. అయితే అంతకుముందే అక్కినేని హీరోగా ఇదే టైటిల్ తో మూవీ వచ్చింది. బావమరదళ్ళు మూవీ శోభన్ బాబుకే కాదు అక్కినేని కూడా ఉంది. అలాగే భార్యాభర్తలు మూవీ కూడా శోభన్ బాబు, అక్కినేని లతో విడివిడిగా ఉంది.

ఒకప్పుడు మల్లెపూవు సినిమా సూపర్ హిట్. ఇందులో శోభన్ బాబు నటనకు జనం నీరాజనం పట్టారు. అయితే ఆ మధ్య భూమిక ప్రధాన పాత్రలో వచ్చిన మూవీకి ఇదే టైటిల్ పెట్టారు. దాసరి, శోభన్ బాబు కాంబోలో గోరింటాకు సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో ఓ పాత్రలో సావిత్రి కూడా నటించింది. అయితే ఇదే టైటిల్ తో హీరో డాక్టర్ రాజశేఖర్ సినిమా కూడా వచ్చింది.

శోభన్ బాబు నటించిన మానవుడు దానవుడు టైటిల్ తో కృష్ణతో ఓ మూవీ, మోహన్ బాబుతో మరో మూవీ వచ్చాయి. కన్నతల్లి టైటిల్ తో శోభన్ బాబు మూవీకి ముందే అక్కినేనితో ఇదే టైటిల్ తో మూవీ ఉంది. శోభన్ బాబు నటించిన రక్తసింధూరం, జేబుదొంగ టైటిల్స్ తో చిరంజీవి సినిమాలు ఉన్నాయి. శోభన్ బాబు నటించిన రాజా మూవీ విక్టరీ వెంకటేష్ తో కూడా వచ్చింది.

మొనగాడు టైటిల్ తో శోభన్ బాబుదే కాకుండా రజనీకాంత్ తో కూడా సినిమా ఉంది. ధర్మచక్రం మూవీ శోభన్ బాబుతోనే కాదు వెంకటేష్ తో కూడా ఉంది. ఇక ముగ్గురు మొనగాళ్లు శోభన్ బాబు తర్వాత చిరంజీవి ఇదే టైటిల్ సినిమాలో మూడు పాత్రల్లో నటించాడు. కాలం మారింది మూవీ శోభన్ బాబు చేస్తే, అదే టైటిల్ తో శరత్ బాబు ఓ సినిమా చేసాడు.

ప్రతీకారం పేరిట శోభన్ బాబు రెండు సినిమాలు చేసారు. శోభన్ బాబు వంశోద్ధారకుడు టైటిల్ బాలకృష్ణ మూవీ కి కూడా పెట్టారు. కృష్ణంరాజు, శోభన్ బాబు కల్సి ఇద్దరూ ఇద్దరే చేయగా, అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున కల్సి ఇదే టైటిల్ తో సినిమా చేసారు. శ్రీదేవి, జయప్రద, శోభన్ బాబు కాంబోలో దేవత మూవీ అప్పట్లో ఓ హిట్. అయితే ఎన్టీఆర్, సావిత్రి నటించిన సినిమా కూడా ఇదే టైటిల్ తో అంతకుముందు వచ్చి దుమ్మురేపింది.

అలాగే నాగయ్య గారి సినిమా కూడా ఇదే టైటిల్ తో ఉంది. జీవితం అనే మూవీ శోభన్ బాబుకే కాదు, వైజయంతిమాల మూవీకి కూడా ఉంది. కృష్ణ, శోభన్ బాబు నటించిన ముందడుగు మల్టీస్టారర్ రాగా, అంతకుముందే ఇదే టైటిల్ తో జగ్గయ్య మూవీ ఉంది. అన్నాచెల్లెళ్లు మూవీ శోభన్ బాబు తర్వాత కృష్ణ కొడుకు రమేష్ బాబుతో ఉంది.

ఇల్లాలు మూవీ శోభన్ బాబుతో ఉండగా, ఇదే టైటిల్ తో హీరో రాజ్ కుమార్ మూవీ కూడా ఉంది. శోభన్ బాబు నటించిన ఆడపడుచు మూవీ శివకృష్ణ హీరోగా కూడా వచ్చింది. శోభన్ బాబు నటించిన సంసారం మూవీ ఎన్టీఆర్ ఒక సినిమా, ఎన్టీఆర్ – అక్కనేని కాంబోలో మరో సినిమా వచ్చాయి. ఇక శోభన్ బాబు సోగ్గాడు మూవీ టైటిల్ తోనే హీరో తరుణ్ ఓ సినిమా చేసాడు.