MoviesTollywood news in telugu

ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో చూడండి

Ottesi Cheputunna Movie Heroine Kanika :సినిమా హిట్ అయినా,కొందరికి లక్కు లేకపోతె ముందుకు వెళ్ళలేరు. దాంతో కొందరు ఇండస్ట్రీలోనే ఆర్టిస్టుగా కూడా వేయడానికి సిద్దమై, అలా స్థిరపడిపోతారు. అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం ఇండస్ట్రీని వదిలేసి, దూరంగా వెళ్ళిపోతారు. హీరో శ్రీకాంత్ నటించిన ఒట్టేసి చెబుతున్నా సినిమాలో హీరోయిన్ గా చేసిన కణిక కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది.

తమిళనాడులో పుట్టిపెరిగిన కణిక మెకానికల్ ఇంజనీరింగ్ చేసింది. తర్వాత యాడ్స్ లో నటించింది. అదే సమయంలో ఓ తమిళ మూవీలో ఛాన్స్ వచ్చింది. తర్వాత టాలీవుడ్ కి 2003లో ఒట్టేసి చెబుతున్నా మూవీతో ఎంట్రీ ఇచ్చి, ఈ సినిమా హిట్ తో మంచి మార్కులు తెచ్చుకుంది. ఆడియన్స్ దృష్టిని బాగానే ఆకర్షించింది. కానీ ఛాన్స్ లు రాలేదు.

ఆ తర్వాత నా ఆటోగ్రాఫ్ మూవీలో హీరో రవితేజతో కల్సి హీరోయిన్ కణిక ఒక చిన్న రోల్ లో నటించింది. తర్వాత తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇక తెలుగులో సినిమాలు చేయలేదు. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గడంతో 2008లో శ్యాం అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న ఈమె తమిళ,మలయాళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ,చెన్నైలో ఓ రెస్టారెంట్ ని స్టార్ట్ చేసింది. మంచి స్టోరీ ఉంటె తెలుగులో చేస్తుందట.