రిలీజ్ లోఅద్భుతాలు క్రియేట్ చేసిన సినిమాలు ఎన్నో…?
Records In Telugu Movies :సినిమాలో దమ్ముంటే 50డేస్, 100డేస్ ఆడడం, రికార్డ్స్ బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ రాబట్టడం చూస్తుంటాం. కానీ కొన్ని సెంటర్స్ లో లేట్ రిలీజ్ సెంటర్స్ లో సైతం రికార్డ్స్ నమోదు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన బాలరాజు కథ మూవీ. ఇది తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 100డేస్ ఆడింది.ఇక ఎన్టీఆర్ పాతాళ భైరవి 175డేస్ ప్రదర్శించారు.
ఆలస్యం గా విడుదలైన మూవీస్ లో లవకుశ ఒకటి. 29కేంద్రాల్లో 100డేస్ తో ఇప్పటికీ రికార్డ్ గా ఉంది. రోజూ మూడు ఆటలతో ఈ సినిమా ఆడింది. 125కేంద్రాల్లో రోజూ 4ఆటలతో రికార్డు క్రియేట్ చేసిన సినిమా శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక 19 కేంద్రాల్లో నువ్వేకావాలి, 16కేంద్రాల్లో కలిసుందాం రా, 100డేస్ ఆడడం ద్వారా ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచాయి. 30సెంటర్స్ లో 50రోజులు ఆడిన సినిమాగా నువ్వేకావాలి రికార్డ్ క్రియేట్ చేసింది.
అంతేకాదు, లేట్ రిలీజ్ లతో 8సెంటర్స్ లో 175రోజులు ప్రదర్శితమై చెరిగిపోని రికార్డ్ క్రియేట్ చేసింది. విజయవాడలో 250రోజులు ఆడి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక రోజులు హౌస్ ఫుల్స్ గా నడిచిన చిత్రాలు పోకిరి, ఖుషి, నువ్వొస్తావనీ మూవీ నిలిచాయి. ఏలూరులో ఖుషి 22రోజులు, మదనపల్లిలో పోకిరి 20రోజులు, విజయవాడలో నువ్వొస్తావనీ 19రోజులు హౌస్ ఫుల్స్ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పోకిరి మూవీ. మొదట 6సెంటర్స్ లో రిలీజై, కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ, ఆతర్వాత 130సెంటర్స్ లో రిలీజయింది.ఇది ఆల్ టైం రికార్డ్.

