బిగ్ బాస్ లో జబర్దస్త్ స్టార్ కమెడియన్…ఎవరో తెలుసా?
Telugu Bigg Boss :ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తిచేసుకుని 5వ సీజన్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే 5వ సీజన్ కోసం స్టార్ కంపైనర్స్ లను ఎంపిక చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా 4వ సీజన్ లో అసలు ముఖం తెలియని వాళ్లను సెలెక్ట్ చేశారన్న విమర్శలు వేగంగానే వచ్చాయి. అయినా అక్కినేని నాగార్జున హోస్ట్ తో బాగానే నడిచింది.
ముఖ్యంగా జబర్దస్త్ షో లో పాపులార్టీ తెచ్చుకున్న వర్షను 5వ సీజన్ లోకి తీసుకు రావడానికి సంప్రదింపులు జరిపినట్లు టాక్. మొదట్లో సీరియల్స్ లో నటించడం ద్వారా పరిచయమైన వర్ష పెద్దగా గుర్తింపు పొందలేక పోయింది. దాంతో జబర్దస్త్ కి వచ్చి తన సత్తా చాటుతోంది.
ఇలాంటి సమయంలో బిగ్ బాస్ లోకి వర్షను రప్పిస్తే, మంచి రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. పాపులార్టీ ఉన్నవాళ్లను తీసుకొస్తేనే షో రక్తి కడుతుందని భావిస్తున్నారు. అయితే వర్ష వస్తుందా రాదా అనేది చూడాలి. అసలు ఇది ఎంతవరకూ నిజమో కూడా క్లారిటీ రావాలి.

