MoviesTollywood news in telugu

యాంకర్స్ నుంచి హీరోయిన్స్ గా మారిన టాప్ యాంకర్స్ వీరే

Tv Anchors In telugu :టీవీల్లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్స్ గా , నటులుగా మారుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మాటీవీలో వచ్చిన కలర్స్ ప్రోగ్రాం లో కలర్స్ స్వాతిగా యాంకరింగ్ తో అలరించిన స్వాతి, ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. డేంజర్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలతో అలరించింది. 2008లో అష్టాచెమ్మా మూవీతో హీరోయిన్ గా మారిపోయి, వరుసపెట్టి సినిమాలు చేసింది. కన్నడ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ సింధుమీనన్ కూడా టాలీవుడ్ లో భద్రాచలం, చందమామ,త్రినేత్రం మూవీస్ తో హీరోయిన్ గా మారింది.

బుల్లితెర రాములమ్మ గా పేరొందిన శ్రీముఖి యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే పెద్దగా సినిమాలు హిట్ కాకపోవడంతో చిన్న చిన్న రోల్స్ చేస్తోంది. జబర్దస్త్ కి ముందే 10 సినిమాల్లో నటించిన యాంకర్ రేష్మి కి ఆ సినిమాలు పెద్దగా పేరు తేలేదు. జబర్దస్త్ షోతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకుంది. దాంతో గుంటూరు టాకీస్ సినిమాలో చేసి,మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాగే యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కంటే ముందే జూనియర్ నటించిన నాగ మూవీలో చిన్న రోల్ చేసింది.

అయితే సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాకపోయేసరికి బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి, మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం ఐటెం సాంగ్స్ మొదలుకుని సపోర్టింగ్ రోల్స్ తో దూసుకుపోతోంది. యాంకర్ సురేఖా వాణి, నటుడు శివాజీ రాజాతో కల్సి మొగుడ్స్ పెళ్లామ్స్ షో చేసి, పాపులర్ అయింది. దాంతో సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. అలాగే యాంకర్ ఉదయ భాను బుల్లితెరపై ఎంతోమంది ఫాన్స్ ని సొంతం చేసుకుంది. హీరోయిన్ ఛాన్స్ వచ్చినా చేయలేదు. కానీ కొన్ని సినిమాల్లో నటించింది. పోవే పోరా ప్రోగ్రాం యాంకర్ విష్ణుప్రియ తాజాగా ఓ సినిమా చేసింది. ఇది ఎప్పుడు వచ్చిందో పోయిందో తెలీదు.