MoviesTollywood news in telugu

అలియా భట్ సోదరి బడా ప్రొడ్యూసర్ అని తెలుసా ?

Alia bhatt Sister Pooja Bhatt :దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్నారు. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈమూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ఇందులో భాగంగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఈ చిత్రం లో సీత పాత్రలో నటిస్తుండగా,ఇందుకు సంబంధించిన పోస్టర్ రెల్లీజ్ కావడంతో మంచి స్పందన వచ్చింది.

అయితే అలియా భట్ వివరాల్లోకి వెళ్తే, హిందీలో పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేష్ భట్ కి కూతురు. ఆషీకీ, సాధి, మర్డర్, సడక్,క్రిమినల్ వంటి మూవీస్ తెరకెక్కించిన మహేష్ భట్ 1970లో కిరణ్ భట్ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వీళ్లకు పూజాభట్ తో పాటు మరో ముగ్గురు పిల్లలున్నారు. అయితే 1986లో మహేష్ భట్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సోనీ రాజధా.

వీరిద్దరికీ పుట్టిందే అలియా భట్. దీంతో పూజా భట్, అలియా భట్ లను తన వారసులుగా ప్రకటించాడు మహేష్ భట్. అలియా భట్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ, బాలీవుడ్ నటుడి ప్రేమలో పడిందని టాక్. త్వరలో పెళ్లి వార్త చెబుతుందని అంటున్నారు. కాగా ఒకప్పుడు సంజయ్ దత్, అమితాబ్, గోవిందా వంటి స్టార్ హీరోలతో నటించిన పూజా భట్ ఇప్పుడు సహ నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తోంది. ఇటీవల బాంబే బేగం సిరీస్ లో కూడా పూజా నటించింది.