MoviesTollywood news in telugu

నటి వై విజయ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu actress Y.Vijaya :ఆడియన్స్ ని మెప్పించాలంటే అందుకు తగ్గ పాత్రలను వేయాల్సి ఉంటుంది. దర్శక నిర్మాతల అభీష్టం మేరకు నడుచుకోవాలి. లేకుంటే ఛాన్స్ లు రావు. వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా నటించి మెప్పిస్తేనే ఇండస్ట్రీలో నిలబడతారు. ఇందుకోసం కొన్నిసార్లు ఇబ్బందులు, ఫ్యామిలీలో సర్దిచెప్పుకోవడం వంటివి తప్పవు. ఒకప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టు వై విజయ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.

చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అందులో నటిస్తున్న వై విజయ తన కూతురిని కూడా షూటింగ్ కి తీసుకొచ్చింది. కూతురిని ఒకచోట కూర్చోబెట్టి తను షూటింగ్ లో పాల్గొంది. కొంతసేపటికి షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఆసమయంలో కూతురు ఆమె దగ్గరకు వెళ్ళింది. చిరంజీవి చూసి , మీ అమ్మాయి అచ్చం మీలాగే ఉందని కితాబిస్తూ, భుజం తట్టి వెళ్లిపోయారు. షూటింగ్ స్పాట్ లో సన్నివేశాల నుంచి అన్నీ గమనిస్తున్న వై విజయ కూతురు మమ్మీ నిన్ను అందరూ పట్టుకుంటున్నారేంటి అని అడిగిందట.

దాంతో తనకు ఏం మాట్లాడాలో తెలియక ఇష్టంగా మాట్లాడినపుడు అలా చేస్తారని చెప్పి కవర్ చేసినట్లు వై విజయ ఓ ఇంటర్యూలో చెప్పారు. డబ్బు విషయంలో విజయశాంతి, రమ్యకృష్ణ సలహాలు పాటించానని, ముఖ్యంగా విజయశాంతి సలహాతో ఓ కల్యాణమండపం, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నట్లు వై విజయ చెప్పారు. వాళ్ళ సలహాలు పాటించకపోతే ఇప్పుడు ఇబ్బందులు పడేదాన్నని చెప్పారు. ప్రస్తుతం తనకు నచ్చిన మంచి అవకాశాలు వస్తే మాత్రమే నటిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."