MoviesTollywood news in telugu

టాలీవుడ్ స్టార్ హీరో కూతురిని గుర్తు పట్టారా…ఎవరో తెలుసా?

TOLLYWOOD Hero Suman Daughter :తమిళనాట మంచి గుర్తింపు పొందుతూ తెలుగులో స్టార్ హీరోగా రాణించిన హీరో సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నెగెటివ్ రోల్స్ లో సైతం నటించి మెప్పిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి సైతం ఒకప్పుడు గట్టిపోటీ ఇచ్చిన సుమన్ అనుకోకుండా కొన్ని సంఘటనల వలన ఇండస్ట్రీకి కొన్నాళ్ళు దూరమయ్యాడు.

తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో హీరోగా వేసినప్పటికీ అంతకుముందులా రాణించలేదు. ఇక సుమన్ కూతురు ప్రత్యుష స్టడీస్ లో టాప్ లో ఉంది. అలాగే భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం సాధించింది. అయితే ఆమెకు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదని, అందుకే తాను కూడా వత్తిడి చేయలేదని ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో సుమన్ వెల్లడించాడు.

తన పేరెంట్స్ కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందినప్పటికీ ఉద్యోగరీత్యా తమిళనాట స్థిరపడ్డంతో చెన్నైలోనే తాను పుట్టి పెరిగానని, స్టడీస్ కూడా అక్కడే పూర్తిచేసానని సుమన్ చెప్పుకొచ్చాడు. 1988లో నాగార్జున, వెంకటేష్ హీరోలుగా వచ్చారని, అయితే అప్పటికే ఇండస్ట్రీలో తాను,చిరంజీవి కొనసాగుతున్నామని గుర్తుచేశాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."