కళ్యాణ వైభోగం సీరియల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సన్నీ
Kalyana Vaibhogam Serial : బుల్లితెరపై కల్యాణ వైభోగమే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సన్నీ తన నటనతో జై పాత్రలో మెప్పించాడు. గత నాలుగేళ్లుగా ఈ సీరియల్ లో నటిస్తూ వచ్చిన సన్నీ హఠాత్తుగా వైదొలిగాడు. అయితే జై పాత్రలో మరొక వ్యక్తిని పెడితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోనని ఏకంగా సీరియల్ కథను మార్చేశారు.
అంతేకాదు, జై,మంగ, భావన పాత్రలను తీసేసి, కథను ముందుకు నడిపిస్తున్నారు. కాగా సన్నీ చాలా రోజుల నుంచి కన్పించక పోవడంతో చాలా పుకార్లు షికారుచేస్తున్నాయి. దీంతో సన్నీ వెళ్లిపోవడానికి కారణం ఏమిటో మేఘన లోకేష్ వివరణ ఇచ్చింది.
ఇక సన్నీ కూడా స్పందిస్తూ,’సీరియల్ టీమ్ తో ఎలాంటి గొడవలు,వివాదాలు లేవు. నాలుగేళ్లుగా ఒకే సీరియల్ లో చేయడం వలన కెరీర్ లో ఛాన్స్ లు రావడం లేదు. అందుకే తప్పుకున్నాను.కొత్త సీరియల్ తో ఆడియన్స్ ముందుకి వస్తా “అని వివరించాడు. దీంతో ఆల్ ది బెస్ట్ సన్నీ అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.