MoviesTollywood news in telugu

యముడి సెంటిమెంట్ తో హిట్ కొట్టిన మూవీస్…ఎన్ని ఉన్నాయో…?

Tollywood movies with yama character :ఎప్పుడో సతీ సావిత్రి సినిమా తర్వాత యముడు క్యారెక్టర్ జోలికి మళ్ళీ ఎవరూ వెళ్ళలేదు. అయితే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన యమగోల సినిమా యముడు సెంటిమెంట్ తో వచ్చింది. కె బాపయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ యముడి వేషంలో రక్తి కట్టించారు. 1977లో ఈ సినిమా రిలీజై అద్భుత విజయాన్ని అందుకుంది.

ఇక 1988లో మెగాస్టార్ చిరంజీవి నటించిన యముడికి మొగుడు మూవీ రిలీజయింది. ఇందులో కూడా కైకాల సత్యనారాయణ యముడు వేషం వేశారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇక 1994లో అలీ హీరోగా ఎంట్రీ ఇస్తూ, ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యమలీల మూవీలో కూడా సత్యనారాయణ యముడిగా వేశారు.

యమలీల మూవీ అనూహ్య విజయం అందుకుంది. ఇందులో యముడికి సాంగ్ పెట్టడం విశేషం. 1999లో మోహన్ బాబు హీరోగా యమజాతకుడు మూవీ వచ్చి, హిట్ కొట్టింది. 2007లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ మూవీ మంచి హిట్ అయింది. ఇందులో యముడిగా మోహన్ బాబు వేసాడు. అదే ఏడాది యమగోల మళ్ళీ మొదలైంది మూవీ వచ్చింది. ఇందులో కూడా కైకాల యముడు క్యారెక్టర్ తో మెప్పించాడు. 2012లో అల్లరి నరేష్ హీరోగా యముడికి మొగుడు మూవీ వచ్చినా ఓ మోస్తరుగా ఆడింది.