ప్రతి రోజు ఎర్ర కారం తినే ప్రతి ఒక్కరూ ఈ నిజాన్ని తెలుసుకోవాలి…లేదంటే…?

Red Chilli Powder Benefits in telugu :మనం ప్రతి రోజు వండుకునే వంటల్లో కారం తప్పనిసరిగా వేస్తాం. కూరల్లో  సరిగ్గా కారం పడకపోతే ముద్ద దిగదు. కొంత మంది పిచ్చి మిరపకాయలు వాడితే … మరికొంత మంది ఎండు కారం వాడుతూ ఉంటారు. కొంత మంది కారం ఎక్కువగా తింటారు. మరి కొంత మంది కారం అంటే ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే విషయాలను తెలుసుకొంటే కారం తినని వారు కూడా కారాన్ని ఇష్టంగా తింటారు. . కానీ, ఇటీవల రకరకాల అనారోగ్యాల పేరుతో కారానికి దూరంగా ఉంటున్నారు చాలా మంది. కానీ తగినంత మోతాదులో  కారాన్ని ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు ఎందుకంటే కారంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అల్సర్ ఉన్నవారు ఎక్కువ కారం తినకూడదు అని అంటూ ఉంటారు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో కారంలో ఉండే కొన్ని సమ్మేళనాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని తేలింది. రక్త ప్రసరణ మెరుగు అయ్యి గుండె సమస్యలు రావు. కీళ్ల నొప్పులు,తలనొప్పి ఉన్నవారు కారం తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక దగ్గు,జలుబు ఉన్నవారు కారం తింటే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఎండు మిర‌ప‌కాయ‌ల పొడి (కారం)లో ఉండే అనేక  ర‌కాల స‌మ్మేళ‌నాలు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ రాకుండా కాపాడతాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.

మిర‌ప‌కాయ‌ల్లో ఉండే క్యాప్సెయిసిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం బరువు తగ్గటానికి సహాయపడుతుంది. కారం తినడం వల్ల వచ్చే చెమట  కారణంగా  శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కారం తిన్న తరువాత శరీర మెటబాలిక్ రేటు దాదాపుగా 8 శాతం వరకు పెరుగుతుందట. దీంతో కొవ్వు కరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా కారంగా ఉన్న ఆహారం
అయితే చాలా తక్కువ మోతాదులో  తింటారు కాబట్టి అలా కూడా బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది. కారంలో ఉండే అనేక  ఔషధ గుణాలు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. దీంతో గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా  ఆరోగ్యంగా ఉంటుంది.