డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోలు…ఎంత మంది ఉన్నారో…!?

Double Hattrick Hits In Tollywood :ఫాన్స్ కి ఆనందం ఎప్పుడంటే, తమ హీరో సినిమా హిట్ అయినపుడు. సినిమా హిట్ అయిందని తెల్సి భారీ ఎత్తున సంబరాలకు సిద్ధమవుతారు. వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టడమే కాదు, ఆరు హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తే, అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. ఇలాంటి అద్భుతాన్ని ఇప్పటిదాకా 12 మంది హీరోస్ సాధించారు. ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వరరావు నాలుగుసార్లు డబుల్ హ్యాట్రిక్ కొట్టగా.. కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ ఒక్కొక్కసారి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. అయితే 1987లో మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి రికార్డు మిస్సయ్యారు.

అయితే 1987లో హిట్లర్ మొదలుకుని మాస్టర్, బావగారు బాగున్నారా,చూడాలని ఉంది,స్నేహం కోసం ఇలా ఐదు హిట్స్ కొట్టినప్పటికీ ఇద్దరు మిత్రులతో డబుల్ హ్యాట్రిక్ మిస్సయింది. నందమూరి బాలకృష్ణ 1986లో ముద్దుల క్రిష్నయ్య,సీతారామ కళ్యాణం,అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇవన్నీ ఒకే ఏడాది వచ్చిన సినిమాలు.

నాగార్జున 2002లో సంతోషం, మన్మధుడు, 2003లో శివమణి, 2004లో నేనున్నాను,మాస్,2005లో సూపర్,2006లో శ్రీరామదాసు డబుల్ హ్యాట్రిక్ రికార్డు సాధించారు. వినోద్ కుమార్ నవయుగం మూవీ నుంచి జడ్జిమెంట్,కర్తవ్యమ్,మామగారు,భారత్ బంద్,మంచిరోజు మూవీస్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు.

వెంకటేష్ 1997లో ప్రేమించుకుందాం రా మొదలుకుని పెళ్లిచేసుకుందాం,సూర్యవంశం,గణేష్,ప్రేమంటే ఇదేరా,రాజా మూవీస్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1997లో గోకులంలో సీత, 98లో సుస్వాగతం,తొలిప్రేమ,1999లో తమ్ముడు, 2000లో బద్రీ,2001లో ఖుషి మూవీస్ తో డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు.

రాజేంద్రప్రసాద్ మాయలోడు మూవీ నుంచి మిస్టర్ పెళ్ళాం,పేకాట పాపారావు,బ్రహ్మచారి మొగుడు,మేడం,అల్లరోడు మూవీస్ తో డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు. అల్లు అర్జున్ గంగోత్రి నుంచి పరుగు వరకు 5హిట్స్ కొట్టి, హ్యాపీ మూవీ వలన డబుల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు.

నేచురల్ స్టార్ నాని 2015లో భలే భలే మగాడివోయ్ నుంచి కృష్ణగాడి వీరప్రేమ గాధ,జెంటిల్ మెన్,మజ్ను,నేను లోకల్,నిన్ను కోరి మూవీస్ తో ఆరు హిట్స్ కొట్టి, డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.