గుప్పెడంత మనసు సంజు రియల్ లైఫ్…నమ్మలేని నిజాలు

Guppedantha manasu serial sanju :ప్రస్తుతం కార్తీక దీపం ఏ రేంజ్ లో దూసుకు వెళుతోందో అదే స్థాయిలో తక్కువ సమయంలో గుప్పెడంత మనసు సీరియల్ కూడా టి ఆర్పీ రేటింగ్ సాధించింది. టాప్ త్రిలో నిల్చిన ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులు కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. వారి నటనకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ఇందులో హీరో రిషి పాత్ర లో ముఖేష్ గౌడ, హీరోయిన్ వసు గా రక్షా గౌడ నటిస్తున్నారు.

ఈ సీరియల్ లో హీరోకి చెల్లిగా సంజు నటిస్తూ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సంజు అసలు పేరు రోషిణి చౌదరి. ఈమె 1990లో జన్మించింది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. రోషిణి చదువుకున్న స్కూల్లోనే ఆమె తల్లి ఆఫీస్ ఇంఛార్జిగా పనిచేసింది. ఈమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. రోషిణి స్కూల్ స్టడీస్ టైం లోనే యాంకరింగ్ గా ట్రై చేసింది.

ఖుషి టివిలో యాంకర్ గా అలరించిన రోషిణి చిన్న పిల్లల్ని బాగా అలరించింది. ఈమెకు డాన్స్ అంటే ఇష్టం. ఇక జెమినిలో పలు షోస్ కి హోస్ట్ గా చేసింది. సెలబ్రిటీస్ ని ఇంటర్యూ చేసింది. మిస్టర్ రాంగ్ డైల్ జాతివజ్రాలు అనే షార్ట్ ఫిలిం లో నటించింది. ఇండస్ట్రీలోకి రావడానికి రోషిణి తండ్రి ఆసక్తి చూపలేదు. కానీ ఆమె తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడంతో ఆయన గర్వపడ్డారట. గుప్పెడంత మనసు తొలిసీరియల్ అయినప్పటికీ బాగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.