రాధ కూతురు కార్తీక ఎక్కడ ఎలా ఉందో తెలుసా?

Tollywood Herine Karthika :ఒకప్పుడు వెండితెరను ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో ఏలిన స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తన చరిష్మా ఏమిటో చూపించింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన జోష్ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కార్తీక ఎంట్రీ ఇచ్చింది.

ఆ మూవీలో చైతు సరసన స్కూల్ టీచర్ గెటప్ తో నటించి, తొలిసినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ హీరో జీవా నటించిన రంగం సినిమాలో చేసిన కార్తీక కు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది. దాంతో తెలుగు,తమిళ,మలయాళంలో మంచి ఛాన్స్ లు వచ్చాయి. అయితే కార్తీక సెలెక్ట్ చేసుకున్న సినిమాలు మంచి విజయాన్ని తీసుకు రాలేకపోయాయి.

దాంతో మూడేళ్లు గ్యాప్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము మూవీలో చేసినప్పటికీ అనుకున్నంతగా ఈ మూవీ ఆడలేదు. స్టార్ హీరోల సరసన ఛాన్స్ రాకపోవడంతో బ్రదర్ ఆఫ్ బొమ్మాళిలో అల్లరి నరేష్ కి అక్కగా నటించింది. మరో రెండు తమిళ సినిమాలు కూడా చేసి, 2017లో ఓ హిందీ సీరియల్ లో చేసింది. అయితే ఇండస్ట్రీకి మొత్తం గుడ్ బై చెప్పేసి, కేరళలో బిజినెస్ చూసుకుంటోంది.