MoviesTollywood news in telugu

నాగార్జున మూవీస్ లో బాలీవుడ్ Stars…ఎంత మందో…?

Tollywood Hero nagarjuna Movies :స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో అతిధిగా కన్పించడం నిజంగా గ్రేట్. ఇలా ఒప్పుకోవడం వారి పెద్దమనసుకి నిదర్శనం. ఆంద్ర అమితాబ్ గా గుర్తింపు పొందిన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తన సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు నటించేలా చేసుకున్నారు. బిగ్ బి అమితాబ్ ‘మనం’ సినిమాలో నటించాడు. నాగార్జునతో పాటు అక్కినేని నాగేశ్వరావు,నాగచైతన్య,అఖిల్,సమంత ఇలా అక్కినేని కుటుంబం నటించిన ఈ సినిమాలో అమితాబ్ గెస్ట్ రోల్ లో కన్పిస్తాడు.

సమంతను ఆసుపత్రిలో చేర్చిన ఘటనలో అమితాబ్ డాక్టర్ గా కనిపిస్తాడు.అమితాబ్ తో నాగ్ ఫోన్ లో మాట్లాడే సన్నివేశం ఉంటుంది. ఇక బిగ్ బి కుటుంబంతో అక్కినేని ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయి. ఇక ఒకప్పుడు నాగ్ నటించిన రక్షకుడు మూవీలో విశ్వసుందరి సుస్మితా సేన్ నటించింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉంటున్న సమయంలో టాలీవుడ్ లో నటించిన ఏకైక సినిమా ఇదే.

రావోయి చందమామ మూవీలో విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ నటించింది. ఓ స్పెషల్ సాంగ్ లో ఆమె నటించి మెప్పించింది. అంతేకాదు,బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా నాగ్ మూవీలో చేసాడు. చంద్రలేఖ మూవీలో గెస్ట్ రోల్ లో కన్పిస్తాడు. యాక్సిడెంట్ అయిన హీరోయిన్ ని కాపాడే ప్రయత్నంలో ఆమె ఫ్యామిలీకి హీరో అబద్ధం చెబుతాడు. డబ్బుకోసం అబద్ధాన్ని కొనసాగించలేక నిజం చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ సంజయ్ దత్ కి తెలుగు రాదు కదా. ఈ సన్నివేశం ఆడియన్స్ ని నవ్విస్తుంది.