ఖిలాడీ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి అసలు నిజాలు ఇవే

Tollywood heroine meenakshi chowdary :ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ కి ఉత్తరాది భామలు చాలామంది వస్తున్నారు. అదేకోవలో హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మోడల్ గా,నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మాస్ మహారాజు రవితేజ హీరోగా వస్తున్న ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

సురేష్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ హిట్ అయితే మీనాక్షి లైఫ్ మారిపోతుందనడంతో సందేహం లేదు. అలాగే ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’,’హిట్ 2′ మూవీస్ లో నటిస్తున్న మీనాక్షి హర్యానాలోని పంచ్ కుల్ గ్రామవాసి. ఈమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేయడంతో ఈమె క్రమశిక్షణతో పెరిగింది. హర్యానాలో జరిగిన స్విమ్మింగ్,బ్యాడ్మింట న్ పోటీల్లో పాల్గొని అనేకసార్లు విజేతగా నిల్చింది.

ఇక 2018లో హర్యానాలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా కాంపిటేషన్ లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. అంతేకాదు, మిస్ ఇండియా పోటీల్లో కూడా మీనాక్షి పాల్గొని విజయాన్ని అందుకుంది. ఇక స్టడీస్ పై చిన్ననాటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టిన ఈమె డెంటల్ కాలేజీ లో చదివి డాక్టర్ అయి కూడా యాక్టర్ గా మారింది.