MoviesTollywood news in telugu

జగన్మోహిని సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…!?

Jaganmohini movie :ఇంగ్లీషులోనే కాదు తెలుగులో కూడా హర్రర్ సినిమాలు చాలానే వచ్చాయి. అందులో నరసింహరాజు హీరోగా వచ్చిన జగన్మోహిని మూవీ ఒకటి. దేవుడు ఉన్నట్లే దయ్యాలు కూడా ఉన్నాయనే కాన్సెప్ట్ తో తీసిన సినిమాలు ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. జానపద చిత్రాల బ్రహ్మగా పేరుమోసిన బి విఠలాచార్య 1978 ఆగస్టు నెలాఖరులో నరసింహరాజు హీరోగా రిలీజైన జగన్మోహిని మూవీ సత్తా చాటింది.అదే సమయంలో వచ్చిన ఎన్టీఆర్ రాజపుత్ర రహస్యం,సింహ బలుడు, కృష్ణ సింహ గర్జన భారీ జానపద చిత్రాలుగా వచ్చి అలరించాయి.

కానీ అగ్రతారలు లేకుండా నరసింహరాజు, జయమాలిని, ప్రభ తదితరులునటించిన ఈ చిత్రానికి అప్పట్లో మంచి థియేటర్లు కూడా దొరకకపోయినా అపూర్వ విజయాన్ని అందుకుంది. కేవలం దర్శకత్వమే కాదు, చిత్ర నిర్మాణాన్ని కూడా విఠలాచార్య చేపట్టారు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో కెమెరా ట్రిక్స్ తో చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. జనాలు విపరీతంగా ఈ సినిమాను ఆదరించారు. జానపద చిత్రాలలో మేటిగా ప్రసిద్ధి పొందిన విఠలాచార్య జానపద చిత్రాలకు ఆదరణ తగ్గడంతో ఎన్టీఆర్ తో నిన్నే పెళ్లాడతా ,అక్కినేనితో బీదల పాట్లు తీయగా నిరాశ పరిచాయి.

హిందీ మూవీ గోపి ని తెలుగులో ఎన్టీఆర్ తో పల్లెటూరి చిన్నోడిగా తీసినా సక్సెస్ రాలేదు. దాంతో కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ ఓ కొత్త ఆలోచనతో పాత బాణీలోనే సినిమా తీయాలని భావించి కథ సిద్ధం చేసుకున్నారు. మురళీమోహన్,భానుచందర్,కార్తీక్,నరసింహరాజు వంటి అప్ కమింగ్ హీరోల పేర్లు రాసి పెట్టుకున్నారు. నీడలేని ఆడది,తూర్పు పడమర,కన్యాకుమారి,ఇదెక్కడి న్యాయం వంటి మూవీస్ తో దూసుకొచ్చిన నరసింహరాజు ఆంద్ర కమల్ హాసన్ గా పేరుపొందాడు.

అయితే ఓ ప్రకటనతో వివాదంగా మారిన నరసింహరాజు వెనుకబడ్డంతో విఠలాచార్య మూవీలో చేయాలన్న కోరిక కలిగింది. సత్యనారాయణ వ్రత మహత్యం మూవీ చేస్తున్నారని తెలిసి వచ్చానని, ఏదైనా వేషం ఇవ్వాలని కోరడంతో నేను ఆ సినిమా చేయడం లేదని,ఓ జానపదం మూవీ చేయాలన్న ఉద్దేశ్యం ఉందని,అందులో నువ్వే హీరో అంటూ విఠలాచార్య ప్రకటించేసారు. క్లబ్ డాన్సర్ సాంగ్స్ కి వేదికగా మారిన జయమాలినిని ఈ సినిమాలో జగన్మోహిని పాత్రకు సెలక్ట్ చేసి సంచలనం సృష్టించారు.

కన్నడ ప్రాంతానికి చెందిన విఠలాచార్య మొదట్లో టూరింగ్ టాకీస్ లు నడుపుతూ శంకర్ సింగ్ దర్శకత్వంలో జగన్మోహిని మూవీ తీశారు. అది సూపర్ హిట్ కావడంతో తెలుగులో డబ్ చేయడంతో ఇక్కడా బాగా ఆడింది. అదే కథను అటూ ఇటూ మార్చి ఇప్పుడు జగన్మోహిని మూవీ తలపెట్టారు. నరసింహరాజు తల్లిగా మహానటి సావిత్రి నటించింది. నరసింహరాజు భార్య పాత్రలో ప్రభ నటించింది. హాస్య నటుడు సారధి కి మంచి పేరు తెచ్చిన ఈ మూవీలో పాము, పులి, పొట్టేలు నటించాయి. పిల్లల్ని ,పెద్దల్ని, మహిళల్ని ఆకట్టుకునేలా ఈ సినిమాలో సన్నివేశాలను విఠలాచార్య పొందుపరిచారు.

ఈ సినిమా హిందీ,తమిళంలోకి అనువదించారు. అన్నిచోట్లా ఘనవిజయం అందుకుంది. ఆంద్ర ,తమిళనాడు బోర్డర్ లలో రీళ్లు తారుమారైన సరే, కథలో ఒక భాగంగా చూసేసారు. విషయం తెల్సి, రాత్రికి రాత్రే విఠలాచార్య మార్పించారు. మారుమూల పల్లెల్లో సైతం ఈ సినిమా బాగా కలెక్షన్స్ తెచ్చింది. అంతేకాదు, ఈ మూవీతో తమిళ సినిమా ఛాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ తర్వాత నరసింహరాజు జానపద హీరో అయ్యాడు. లక్ష్మి కటాక్షం, త్రిలోక సుందరి, గంధర్వ కన్య వంటి మూవీస్ వచ్చాయి.