MoviesTollywood news in telugu

విద్యాబాలన్ మొదటి పారితోషికం ఎంతో తెలుసా?

vidyabalan first remuneration :పేరుకు దక్షిణాది తార అయినప్పటికీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న విద్యాబాలన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి సినిమాల్లో సత్తా చాటుతోంది. తాజాగా ఆమె నటించిన షేర్నీ అనే మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. షేర్నీ ప్రమోషన్స్ లో పాల్గొన్న విద్యాబాలన్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

తొలిసారి ఒక టూరిస్ట్ క్యాంపెయిన్ కొరకు కెమెరా ముందుకు వచ్చా. ఆ ఫోటో షూట్ లో తనతో పాటు నా కజిన్ ఫ్రెండ్ పాల్గొన్నారు. ఆ ఫోటో షూట్ కొరకు చెట్టు దగ్గర నిలబడి ఫోజులు ఇవ్వాలని అలా ఫోజులు ఇచ్చినందుకు 500 రూపాయలు పారితోషికంగా లభించింది ” అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఆ 500 రూపాయలే తన మొదటి సంపాదనగా చెప్పింది.

ఇక ఆ తరువాత నేను ఒక సీరియల్ లో నటించా. సీరియల్ అడిషన్స్ కొరకు తాను అమ్మ,సోదరితో పాటు వెళ్లా. ఆ సీరియల్ అడిషన్స్ కొరకు ఏకంగా 150 మంది రావడంతో నేను సెలక్ట్ అవుతానా లేదా అని భయపడ్డా. అయితే అదృష్టవశాత్తు ఆ సీరియల్ లో నటించే ఛాన్స్ దక్కింది’ అని విద్యా బాలన్ వివరించింది. అయితే ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా విద్యాబాలన్ ఎదిగింది.