చెల్లెలి కాపురం సీరియల్ హిందీ సీరియల్ రీమేక్ అని తెలుసా ?

chelleli kapuram serial :స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న చెల్లెలి కాపురం సీరియల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయంత్రం వచ్చే సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ గా చెల్లెలి కాపురం నిలుస్తోంది. ఇందులో నటీనటులు తమ నటనతో,అందంతో ఆకట్టుకుంటున్నారు. అందుకే ఈ సీరియల్ కి ఫ్యామిలీలలో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

కార్తీక దీపం సీరియల్ మాదిరిగానే చెల్లెలి కాపురం సీరియల్ కి కూడా ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. అయితే చాలా సీరియల్స్ ఇతర భాషలలో హిట్ అయిన సీరియల్స్ కి రీమేక్ గా వస్తున్నవే. ఇక హిందీ భాషలో వచ్చిన ఓ సీరియల్ కి రీమేక్ గా చెల్లెలి కాపురం ప్రసారం చేస్తున్నారని టాక్.

సోషల్ మీడియాలో చెల్లెలి కాపురం రీమేక్ సీరియల్ అనే విషయంపై వస్తున్న కథనాలు ఎంతవరకూ నిజమో అబద్ధమో తెలీదు. అధికారికంగా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. దంగల్ టివి ఛానల్ లో ప్రేమ బంధం సీరియల్ 2020నుంచి వస్తోంది. ఇది విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి దానికి ఇది రీమేకా కాదా అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రేమ బంధం సీరియల్ కి రీమేక్ అని బలంగా వినిపిస్తుంది.