రెచ్చిపోదాం బ్రదర్ షో యాంకర్ మేఘన గురుంచి మీకు తెలియని విషయాలు

Recchipodam Brother comedy show anchor :బుల్లితెరమీద సీరియల్స్ తో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఎక్కువ కావడంతో ఎక్కువమంది యాంకర్స్ వస్తున్నారు. ఈ యాంకర్స్ లో కొందరికి మంచి పేరు వచ్చినా కొందరు నిలదొక్కుకోలేక పోతున్నారు. దీంతో ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అయితే తాజాగా వర్షిణి,విష్ణుప్రియ కూడా యాంకర్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈటివి ప్లస్ లో తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోతో యాంకర్ మేఘన ఎంట్రీ ఇచ్చింది. అనసూయ,రష్మీ మాదిరిగా స్టార్ యాంకర్ కావాలన్న కోరికతో ఇప్పుడిప్పుడే ఆడియన్స్ దగ్గరవుతున్న మేఘన గురించి వివరాలు పరిశీలిస్తే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె పూర్తిపేరు మేఘనా కుమార్. నలంద విద్యానికేతన్ లో స్కూల్ విద్య పూర్తిచేయగా, వి ఎస్ లక్ష్మి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసింది. స్టడీస్ పూర్తయ్యాక మేఘన యాక్టింగ్ పై ఆసక్తితో తమిళ ఇండస్ట్రీలో చేరి, కొన్ని సీరియల్స్ లో నటించింది. తెలుగులో ‘ ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. అయితే పెద్దగా పేరు రాక,రెచ్చిపోదాం బ్రదర్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.