MoviesTollywood news in telugu

కోమలి సిస్టర్స్ ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా ?

Komali sisters :చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు పెద్దయ్యాక హీరోయిన్స్ గా, నటులుగా రాణిస్తున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఒకప్పుడు బుల్లితెర మీద బుల్లి సిస్టర్స్ గా దుమ్మురేపిన కోమలి సిస్టర్స్ జంట అందరికీ గుర్తుండే ఉంటుంది. పెద్దమ్మాయి పేరు హీరోషిణి, చిన్నమ్మాయి పేరు దేవర్షిణి. అప్పట్లో వీళ్ళు చేసే షోస్ కి మంచి డిమాండ్ ఉండేది. సడన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఇప్పుడు పెద్దయ్యారు.

చిన్నప్పుడు టివి షోస్ తో కామెడీ పంచుతూ అందరి మదిలో చెరగని ముద్ర వేశారు. అలాగే మిమిక్రి ఆర్టిస్టులుగా కూడా కామెడీతో దుమ్మురేపారు. దాంతో అందరి మన్ననలు అందుకున్నారు. పొలిటికల్,మూవీ అంశాలతో కామెడీ షోస్ బాగా ఆకట్టుకున్నాయి. దాంతో పాపులార్టీ ఎక్కువే వచ్చింది. రెమ్యునరేషన్ కూడా బాగానే అందుకునేవారు.

అదే సమయంలో చిన్న వయస్సులో పెద్ద మాటలు అంటూ విమర్శలు కూడా కోమలి సిస్టర్స్ మూటగట్టుకున్నారు. కానీ ఈమధ్య వీరి గురించి వార్తలు వస్తున్నాయి. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. చిన్నమ్మాయి ఫారిన్ లో ఉన్నత చదువు చదువుతోంది. పెద్దమ్మాయి హిరోషిణి ఓ తమిళ మూవీకి ఒకే చెప్పినట్లు, కన్నడ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. ఇక చిన్నమ్మాయి కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుందట.